Thalapathy: లియో హైప్ సినిమాకు ప్లస్ అవబోతుందా ? మైనస్ అవబోతుందా ?

దళపతి విజయ్ హీరోగా వస్తోన్న లియో సినిమాపై ప్రేక్షకుల్లో ఎన్ని అంచనాలున్నాయో తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతుంది. భారీ బడ్జెట్ తో, భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాకు తెలుగు, తమిళ్ తో పాటు అన్ని భాషలలో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది.

అయితే ఒక సినిమాకు హైప్ అనేది ఉండటం మంచిదే కానీ ఆ హైప్ ఓవర్ డోస్ అయితే ఆ ఎఫెక్ట్ సినిమా రిజల్ట్ పైన పడుతుంది. ఇక లియో విషయంలో కూడా ఇదే జరిగేలా ఉందని తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ లియో సినిమా షూటింగ్ స్టార్ట్ చేయబోయే ముందు రోజే సినిమా టైటిల్ ఎనౌన్స్ చేస్తూ ఒక గ్లిమ్స్ వీడియోను రిలీజ్ చేసాడు. ఇక ఆ వీడియోతో లియో సినిమాకు విపరీతమైన బజ్ వచ్చింది. ఇక ఆ తరువాత షూటింగ్ అప్డేట్స్, పోస్టర్స్, పాటలు విడుదలవుతూ సినిమాపై హైప్ ను మరింతగా పెంచాయి.

ఇక ఇంత హైప్ నడుమ కొద్దీ రోజుల క్రితమే లియో సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అయితే ఈ ట్రైలర్ నిజానికి ఆసక్తికరంగానే ఉన్న.. లియో సినిమాకు హైప్ ఓవర్ డోస్ అవడం వల్ల.. ట్రైలర్ ఆశించినంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో త్వరలోనే విడుదలకు సిద్ధంగా సినిమా కూడా ఇదే విధమైన అనుభవాన్ని మిగుల్చుతుందేమోనని అభిమానుల్లో ఆందోళన మొదలైంది.

- Advertisement -

గతంలో కూడా భారీ బడ్జెట్ తో నిర్మించబడి ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను క్రియేట్ చేసిన సినిమాలు ఓవర్ హైప్ కారణంగా కంటెంట్ పరంగా మంచి కథలే అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. మరి ఈ పరిస్థితిని బట్టి చూస్తే లియో సినిమాకు ప్రస్తుతం ఉన్న హైప్ మైనస్ అవబోతుందనే చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు