Gopichand32: సాంగ్ షూట్ లో గోపీచంద్ శ్రీను వైట్ల సినిమా..! గ్యాప్ ఇవ్వట్లేదుగా?

టాలీవుడ్ లో ఇకప్పుడు ఎంటర్టైన్మెంట్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన డైరెక్టర్ శ్రీనువైట్ల. కేవలం కామెడీ ఆక్షన్ ఎంటర్టైనర్ లతోనే టాప్ డైరెక్టర్లలో ఒకడిగా స్టార్ స్టేటస్ ని అనుభవించిన ఈ దర్శకుడు పదేళ్లుగా సరైన హిట్ లేక అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటి తరుణంలో మ్యాచో స్టార్ గోపీచంద్ చక్కటి అవకాశం ఇచ్చాడు.

శ్రీను వైట్లతో రెగ్యులర్ గా సినిమాలు చేసిన రవితేజ లాంటి హీరోలు కూడా రిజెక్ట్ చేస్తే గోపీచంద్ సినిమా చేయడానికి అంగీకరించడం సాహసమనే చెప్పాలి. గత నెలలోనే పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుపుకుంటుంది. మొన్నటివరకు “భీమా” షూటింగ్ లో ఉన్న గోపీచంద్, ఆ షూటింగ్ పూర్తవగానే, శ్రీను వైట్లతో షూట్ చేస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా యూనిట్ ఇటలీ లోని ‘మిలన్’ సిటీ కి చేరుకున్నారు. అక్కడే కొన్ని బ్యూటిఫుల్ లొకేషన్లలో ఓ సాంగ్ ని షూట్ చేస్తున్నారు. ఆ సాంగ్ కి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తుండగా, లేటెస్ట్ గా వచ్చిన స్టిల్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఇక దసరా సందర్బంగా ఈ సినిమా అప్డేట్ ని కూడా ఇస్తారని మేకర్స్ ప్రకటించడం జరిగింది. అయితే గోపీచంద్ తన రెండు సినిమాల షూటింగ్ లో ఒకేసారి పాల్గొంటూ ఉండగా, రెండింట్లో ఏది ముందు ఫినిష్ అయితే ఆ సినిమా రిలీజ్ చేస్తారని సమాచారం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు