Renu Desai Comments: వరుణ్-లావణ్యల పెళ్లికి రేణు దేశాయ్ బిగ్ ట్విస్ట్?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠిల ఏడేళ్ల ప్రేమ పెళ్లితో ఒక్కటి అవ్వబోతుంది. ఇటలీలో డిస్టెనేషన్ వెడ్డింగ్ జరగనుంది. అతి తక్కవ మంది అతిథుల మధ్య ఈ పెళ్లి వేడుక జరగబోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మొత్తం ఇటలీకి చేరుకున్నారు. అల్లు అర్జున్ తన పుష్ప 2 సినిమా షూటింగ్ కు, రామ్ చరణ్ తన గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ఇటలీకి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కూడా తన భార్య అన్నా లేజీనావోతో కలిసి ఇటలీ వెళ్లారు.

అయితే పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కి కూడా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి ఆహ్వానాన్ని మెగా ఫ్యామిలీ పంపించారట. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లికి రేణు దేశాయ్ దూరంగా ఉండాలని నిర్ణయించుకుందట.

అయితే మెగా కంపౌండ్ లో ఎలాంటి శుభకార్యం జరిగిన రేణు దేశాయ్ కి ఆహ్వానం వెళ్తుందని తెలుస్తుంది. గతంలో నిహారిక పెళ్లి సమయంలో కూడా రేణు దేశాయ్ కి మెగా ఫ్యామిలీ ఆహ్వానం పంపించింది. అయితే అప్పుడు కూడా రేణు దేశాయ్ వెళ్లలేదు. కానీ, మెగా వారసులు అకీర నందన్, ఆధ్యని మాత్రం పంపించింది. కానీ, ఇప్పుడు వరుణ్, లావణ్యల పెళ్లి కి మాత్రం అకీర, ఆధ్యను కూడా పంపించడం లేదని సమాచారం.

- Advertisement -

అయితే ఈ పెళ్లికి ఎందుకు వెళ్లడం లేదు అనేది దానికి మాత్రం సమాధానం లేదు. ఒక వేళ తాను.. మెగా ఫ్యామిలీకి మాజీ అనే ట్యాగ్ తో వెళ్లడం ఇష్టం లేదేమో… అందుకే అప్పుడు నిహారిక పెళ్లికి, ఇప్పుడు వరుణ్ తేజ్ పెళ్లికి దూరంగా ఉంటుందేమో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు