Extra-OrdinaryMan: ఇక నితిన్ ఇలాంటి కామెడీలు చేస్తూ బతకాల్సిందేనా?

టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్లలో నితిన్ ఒకరు. ఒకప్పుడు మీడియం రేంజ్ హీరోల్లో టాప్ ప్లేస్ ని అనుభవించిన ఈ హీరో, ప్రస్తుతం ఒక్క హిట్ కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. టాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న హీరోల్లో ఒకడైన నితిన్ తన స్క్రిప్ట్ సెలక్షన్ మిస్టేక్స్ తో చాలా డౌన్ కూడా అయ్యాడు.

అయితే దీనికి కారణం ఏమై ఉంటుందా అని అనుకుంటే చాలా మందికి కనిపించే రీసన్ ఒక్కటే. స్క్రిప్ట్ సెలక్షన్. నితిన్ క్లాస్ సినిమాలు మాత్రమే సెట్ అవుతాయి. ఒకప్పుడు ఇలాగే మాస్ ఇమేజ్ కోసం కలిసి రాని మాస్ సినిమాలు చేసి పదేళ్ల పాటు సరైన హిట్ లేక ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న నితిన్, ఇష్క్ తో మంచి బ్రేక్ తీసుకుని ట్రాక్ లో పడ్డాడు. మధ్యలో ఐదారేళ్లు బాగానే హిట్లు కొట్టినా, మళ్లీ మూడేళ్ళుగా ప్లాపులు ఎదుర్కొంటున్నాడు.

దీనికి కారణం నితిన్ ఒకే ఫార్ములా తో సినిమాలు తీయడమే. తనకి క్లాస్ సినిమాలతోనే హిట్స్ వస్తున్నాయన్న భ్రమలో కామెడీ జోనర్ లోనే సినిమాలు చేస్తున్నాడు. అలా గత పదేళ్లలో “అఆ”, ‘భీష్మ’ మినహా చేసిన సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి.

- Advertisement -

తాజాగా నితిన్ నటిస్తున్న “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” టీజర్ రిలీజ్ అయింది. టీజర్ చూసాక ఇది కూడా రెగ్యులర్ ఫార్మాట్ లోనే రొటీన్ కామెడీ సినిమాల ఉందని అనిపించింది. పైగా ఈ సినిమా డైరెక్ట్ చేస్తుంది “వక్కంతం వంశి”, అయినా సరే టీజర్ అంత రొటీన్ గా తీస్తాడని అనుకోలేదని సోషల్ మీడియా లో ఫ్యాన్స్ గుస్సా అవుతున్నారు. మరి నితిన్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ లో కొత్త సినిమాలు ఎప్పుడొస్తాయో?

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు