Vakkantham Vamsi: నా పేరు సూర్య నుండి కోలుకుంటాడా.?

త్రివిక్రమ్ శ్రీనివాస్, బుర్ర సాయి మాధవ్  లాంటి వాళ్ళ తర్వాత రచయితగా పీక్ రేంజ్ లో మంచి పేరును సాధించాడు వక్కంతం వంశీ. రచయితగా “కిక్” , “టెంపర్” లాంటి మంచి హిట్ సినిమాలు ఉన్నాయి “వక్కంతం వంశీ” కెరియర్ లో. సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీ కాంబినేషన్ లో వచ్చే సినిమాలపై  ఇప్పటికి ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి.

ప్రతి రచయిత కూడా ఏదో ఒక దశలో దర్శకుడుగా మారాలి అని అనుకుంటాడు. అలానే వక్కంతం వంశీ కూడా “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమాతో దర్శకుడుగా మారాడు.  కానీ ఈ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు దర్శకుడుగా తన టాలెంట్ ని చూపించిన కూడా కథ విషయంలోని కొంచెం కన్ఫ్యూజన్లో పడ్డాడని చెప్పవచ్చు.

వంశీ మళ్లీ కొంచెం గ్యాప్ తీసుకొని నితిన్ హీరోగా “ఎక్స్ట్రాడినరీ మ్యాన్” అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ చూస్తే ఈ సినిమాలో నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించబోతున్నట్లు అర్ధమవుతుంది. బహుశా టీజర్ లో చెప్పినట్లు ఒక ఆర్డినరీ మ్యాన్ ఎక్స్టెర్డినరీ మ్యాన్ గా ఎలా అయ్యాడు అని చూపించబోతున్నాడేమో వంశీ అనిపించేలా ఉంది. నితిన్ ఈ సినిమాలో పలు గెటప్స్ కనిపిస్తున్నాడు.

- Advertisement -

ఈ సినిమాపై ఇటు వక్కంతం వంశీకి, అటు నితిన్ కి మంచి అంచనాలు ఉన్నాయి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా గాయాన్ని ఈ సినిమా అయినా  మాన్పుతుందో లేదో తెలియాలి అంటే డిసెంబర్ 8 వరకు వెయిట్ చెయ్యక తప్పదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు