Biggboss season7: అందరు అయిపోయారని అర్జున్ ని పట్టుకుంది శోభ?

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 రోజురోజుకి ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఈ వారం ఊహించని విధంగా సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అవగా, ఈ సీజన్లో ఫస్ట్ మేల్ ఎలిమినేషన్ అని చెప్పొచ్చు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 లో శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరితో నామినేషన్ టైం లో గొడవ పడిందని చెప్పొచ్చు. నామినేట్ తాను చేసినా, లేక తనే నామినేట్ అయినా గొడవ మాత్రం కామన్. అయితే అది నామినేషన్ టైం కే ఎండ్ అవకుండా ఆ తర్వాత కూడా వారమయ్యే వరకు అలుగుతూ గొడవ పడుతూనే ఉంటుంది.

అయితే శోభా చేస్తున్న ఈ యాంగ్రీ బిహేవియర్ వల్లే ఆడియన్స్ నుండి కూడా ట్రోలింగ్ కి గురవుతుంది. అయితే ఈ సీజన్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితోనూ నామినేషన్స్ టైం లో గొడవ పడ్డ శోభా, ఒక్క అర్జున్ తో మాత్రం సందర్భం రాలేదు. తాజాగా అర్జున్ తో కూడా వాగ్వాదం పెట్టుకుంది శోభా.

తాజాగా రిలీజ్ అయిన బిగ్ బాస్ ప్రోమోలో అర్జున్ తనని తాను మార్చుకొమ్మని శోభా కి అడ్వైజ్ ఇస్తూ నామినేట్ చేసాడు. ఇక శోభా ఎప్పటిలాగానే నేనిలాగే ఉంటా, నాలాగే ఉంటానన్నట్టు నామినేట్ ని తిరస్కరించి, లొల్లి స్టార్ట్ చేసింది. ఇక ఎప్పట్లాగే ఇదే తంతు అని ఆడియన్స్ మాత్రం ఈ సీరియల్ లాంటి నామినేషన్స్ ని ఎంజాయ్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు