Allu Arjun: విమర్శలు నుండి నేషనల్ అవార్డ్ వరకు

అల్లు అర్జున్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాదు ఈ బ్రాండ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనకంటూ సొంత స్టైల్ని క్రియేట్ చేసుకున్నాడు.మెగాస్టార్ సపోర్ట్ తో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు సాధించి , నేడు తనకంటూ ఒక ఆర్మీ ను క్రియేట్ చేసుకున్నాడు.

కెరీర్లో మొదటిసారిగా ఎన్నో విమర్శలు ఎదుర్కున్న అల్లు అర్జున్,”ఆర్య” సినిమాతో ఆ విమర్శలు అన్నిటికీ చెక్ పెట్టాడు. తన స్టైల్ , డైలాగ్ డెలివరీ , వాయిస్ మాడ్యులేషన్ ఆడియన్స్ ఆకట్టుకుని తనకంటూ ఫ్యాన్స్ ను సాధించుకున్నాడు. సినిమా , సినిమాకి వేరియేషన్స్ చూపిస్తూ నటుడిగా నిలద్రొక్కుకుని నేడు నేషనల్ అవార్డు అందుకునే స్థాయికి వచ్చాడు.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి చాలామంది హీరోలు ఉన్నారు. బాక్సాఫీస్ హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కలెక్షన్ ను కొల్లగొట్టి హీరోలు ఉన్నారు. కానీ నేషనల్ అవార్డు ను పొందుకోవడం అనేది వేరే లెవెల్. “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చిన అల్లు అర్జున్, “అలవైకుంఠపురంలో” సినిమాతో సంక్రాంతి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.

- Advertisement -

ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన “పుష్పా” సినిమా కమర్షియల్ సినిమాకి ఒక కొత్త నిర్వచనాన్ని చూపించింది. “పుష్పా” సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. క్రికెటర్స్, పొలిటీషియన్స్ ఇలా చాలామంది పుష్ప సినిమా డైలాగ్స్ ని తమ సొంత స్టైల్ లో తగ్గేదేలే అంటూ ఇమిటేట్ చేసారు.

సినిమాలో డైలాగ్ లానే, సినిమా కూడా ఎక్కడా తగ్గకుండా “తగ్గేదే లే” అంటూ కలెక్షన్లు సాధించింది. ప్రతి ఇండస్ట్రీకి తెలుగు సినిమా స్టామినా ఇది అని నిరూపించింది. కేవలం కమర్షియల్ గా హిట్ కావడమే కాకుండా,
అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ను తెచ్చిపెట్టింది. ఏదేమైనా మొదటి సినిమాకి విమర్శలు ఎదుర్కున్న హీరో ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నర్ అయ్యాడు. పుష్ప రాజ్ మాటల్లో చెప్పాలంటే బన్నీ కెరియర్ తగ్గేదెలే

Check out Filmify for the latest Movie updates, New,  Movie ReviewsRatings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు