Allu arjun: ఇదెక్కడి ట్విస్ట్ అల్లు అర్జున్ కొత్త సినిమా క్రిష్ జాగర్లమూడి తోనా ?

Allu arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గత కొద్దీ రోజులుగా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా తరువాత అట్లీ తో సినిమా చేస్తాడని.. లేదు.. త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని.. ఇవన్నీ కాదు సందీప్ రెడ్డి వంగ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేస్తాడని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ వార్తలన్నిటికి చెక్ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది. అదేంటంటే అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఒక సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. కాసేపటి క్రితమే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఒక పోస్టర్ కూడా లీక్ అయింది. దాంతో సోషల్ మీడియాలో అంత ప్రస్తుతం ఈ సినిమా గురించి డిబేట్స్ జరుగుతున్నాయి.

కొంత మంది అల్లు అర్జున్, క్రిష్ తో చేస్తున్నది సినిమా కాదని షార్ట్ ఫిలిం అని చెబుతున్నారు. మరికొంత మంది రిలీజైన పోస్టర్ కేవలం అడ్వార్టైజ్మెంట్ కు సంబందించినది మాత్రమే అని అంటున్నారు. అయితే ఈ రెండిట్లో ఏది నిజం, ఏది అబద్దం అనే విషయం ఎవరికీ తెలియటం లేదు.

- Advertisement -

అయితే క్రిష్, అల్లు అర్జున్ తో సినిమా చేయడం ఆయన అభిమానులకు ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తోంది. డైరెక్టర్ క్రిష్ కు ఇండస్ట్రీలో మంచి పేరున్నప్పటికీ సక్సెస్ మాత్రం లేదు. దానికి తోడు ఈయన సినిమా తీసే విధానం మెజారిటీ సినీ ప్రేక్షకులకు నచ్చదు.. అందుకే సడన్ గా క్రిష్ తో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని తేలియాగానే సర్ప్రైజ్ కన్నా ఎక్కువగా షాక్ కు గురయ్యారు అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల్లో ఏది నిజమో, ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగాల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు