Pongal Race: ‘సంక్రాంతి’ బరిలో అరడజను సినిమాలు?

Pongal Race:

టాలీవుడ్ లో సినిమాల సీజన్ అంటే సంక్రాంతి మరియు దసరా. ఈ పండగల్లో వచ్చే సినిమాలు భారీ అంచనాలతో వస్తాయి. పెద్ద హీరో నుండి చిన్న హీరోదాకా అందరు హీరోలు ఈ పండగల్లో తమ సినిమాలని తీసుకురావాలని ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఇప్పుడున్న థియేటర్లు, మార్కెట్ ల రేంజ్ దృష్ట్యా ఒకేసారి మూడు లేదా నాలుగు సినిమాలకి మించి పోటీ పడే పరిస్థితి లేదు. అయితే రాబోతున్న సంక్రాంతి పోటీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.

ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత పొంగల్ రేసులో అరడజను సినిమాలు బరిలో నిలుస్తున్నాయి. అది కూడా అన్ని స్ట్రెయిట్ తెలుగు సినిమాలే కావడం విశేషం. అయితే ఈ సినిమాల్లో అన్నిటికంటే ముందే కర్చీఫ్ వేసిన సినిమా “గుంటూరు కారం”. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండడంతో భారీ అంచనాలున్నాయి. దానికి తోడు రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ కూడా ఆకట్టుకుంది.

గుంటూరు కారం తర్వాత వస్తున్న మరో పెద్ద సినిమా “కల్కి 2898AD”. రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడు. నిజానికి కల్కి ఈ ఇయర్ ఎండింగ్లో రావాల్సి ఉండగా వాయిదా పడి సంక్రాంతికి వస్తుంది. కానీ ట్రేడ్ పండితులు అప్పుడు కూడా ఖచ్చితంగా వస్తుందో లేదో చెప్పలేకపోతున్నారు. ఇక తాజాగా మరో రెండు మీడియం రేంజ్ సినిమాలు పొంగల్ రేసులో నిలిచాయి.

- Advertisement -

అందులో ఒకటి నాగార్జున హీరోగా నటిస్తున్న “నా సామిరంగ”. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మెప్పించగా, సంక్రాంతికి వస్తున్నామని ఆ టీజర్ లోనే చెప్పేసారు. ఇక లేటెస్ట్ గా మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న “ఈగిల్” సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా “హనుమాన్” కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ చెప్పడం జరిగింది.

ఇవే కాకుండా డబ్బింగ్ సినిమాలు “అయలాన్”, కంగువా కూడా రేసులో ఉన్నాయి. అయితే సంక్రాంతి టైం వచ్చే సరికి ఇందులో సగం సినిమాలు తప్పుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు