Mahesh babu : పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తో మల్టీ స్టార్టర్ సినిమా ప్లాన్ చేసిన ఆ డైరెక్టర్ ?

Mahesh babu

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలిసి మల్టీ స్టార్టర్ సినిమా చేయాలనేది ఎంతో మంది సినీ ప్రేక్షకుల ఆశ, కానీ అది ఈరోజు వరకు కూడా నెరవేరలేదు. అప్పుడెప్పుడో త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు.  ఒకరకంగా ఆ సినిమానే ఈ ఇద్దరు హీరోలు చేసిన మల్టి స్టారర్ సినిమా అని చెప్పవచ్చు. ఆ తరువాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కలిసి త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటిస్తారని వార్తొలొచ్చిన అది కూడా కార్యరూపం దాల్చలేదు.

అయితే లేటెస్ట్ గా చూస్తే.. వీరిద్దరి కాంబినేషన్ నిజానికి త్రివిక్రమ్ కాకుండా ఒక డైరెక్టర్ సినిమా ప్లాన్ చేసాడట. స్క్రిప్ట్ కూడా ఫైనల్ అయ్యి..మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కు కథ వినిపించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయట. మహేష్ కథ విన్న తరువాత పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడట కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆ సినిమా కథపై అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఆ సినిమా మరో సీనియర్ నటుడి చేతికి వెళ్ళింది.

ఇంతకు ఆ సినిమా ఏంటి ? పవన్ కళ్యాణ్, మహేష్ బాబు తో మల్టీ స్టారర్ సినిమా చేయాలనుకున్న ఆ డైరక్టర్ ఎవరని అనుకుంటున్నారా.. ఆ డైరక్టర్ మరెవరో శ్రీకాంత్ అడ్డాల. ఇక ఆయన మహేష్, పవన్ తో చేయాలనుకున్న సినిమానే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

- Advertisement -

శ్రీకాంత్ అడ్డాల దర్శకుడిగా పరిచయమైన కొత్త బంగారు లోకం సినిమా మంచి విజయం సాధించటంతో దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా చేయడానికి శ్రీకాంత్ అడ్డాలకు అవకాశం వచ్చింది. ఇక ఆ సమయంలోనే బాగా టైం తీసుకొని శ్రీకాంత్ అడ్డాల సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు స్క్రిప్ట్ రాసుకొని దిల్ రాజు దగ్గరకు వెళ్ళాడట. దిల్ రాజు కు ఆ బాగా కథ నచ్చి మహేష్, పవన్ కళ్యాణ్ ఒకే అంటే సినిమా చేయడానికి రెడీ కూడా అయ్యడట. కానీ పవన్ కళ్యాణ్ డేట్స్ దొరికాక పోవడం వల్ల చివరికి ఆ సినిమా వెంకటేష్ చేయవలసి వచ్చిందట. అయితే ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయాన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలనే ఆయన లేటెస్ట్ సినిమా పెద కాపు ప్రమోషన్స్ లో చెప్పాడు. దాంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు