Top Directors: ఓటమి ఎరుగని దర్శకులు

ఒక మధ్యతరగతి కుటుంబానికి ఉండే ఏకైక వినోదం సినిమా.
సినిమా కొందరికి వ్యాపారం
ఇంకొందరికి వ్యాపకం
మరి కొందరికి సినిమాయే జీవితం.
మాములు మనుషులు జీవితాల్లో సినిమా ప్రముఖ పాత్రను పోషిస్తుంది. సినిమా సమాజాన్ని మార్చుతుంది అంటారు కొందరు, సినిమా సమాజాన్ని కరెక్ట్ చెయ్యదు రిఫ్లెక్ట్ చేస్తుంది అంటారు ఇంకొందరు.
కొందరు దర్శకులు ప్రేక్షకులుకు నచ్చే సినిమాలు తీస్తారు,
ఇంకొందరు దర్శకులు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీస్తారు.
భాష తో సంబంధం లేకుండా అలా ఇప్పటివరకు ప్రేక్షకులు మెచ్చే సినిమాలు తీసే దర్శకులు అంటే మనకు టక్కున గుర్తొచ్చేది రాజ్ కుమార్ హిరానీ , రాజమౌళి , ప్రశాంత్ నీల్.

రాజ్ కుమార్ హిరానీ తీసినవే ఐదే సినిమాలు
కానీ ఒకదానిని మించి ఒక సినిమా ఉంటుంది,
సినిమా తీయడానికి ఈయన ఎక్కువ టైం తీసుకుంటారు,
కానీ ఈయన సినిమాలు మాత్రం టైంలెస్.
ఈయన తన సినిమాలతో ఆడియన్స్ ఆలోచింపజేస్తారు.
“సంజు” సినిమాను మినహాయిస్తే ,
ఈయన “ఫిష్ అవుట్ అఫ్ ది వాటర్” (తనది కానీ ప్రపంచంలో తాను బ్రతకడం) అనే కాన్సెప్ట్ బాగా నమ్ముతారు హిరానీ గారు.
ఒక దాదా తనకు సంబంధం లేని కాలేజ్ కి వచ్చి కొత్త మనుషులు మధ్య చదవడం “మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్”
యావరేజ్ స్టూడెంట్స్ ఒక టాప్ కాలేజ్ లో చదవడం “త్రీ ఇడియట్స్” అసలు ఈ భూ ప్రపంచానికి సంబంధం లేని ఒక “ఏలియన్” ఇక్కడ ఉండాల్సి వస్తే ఎలా ఉంటుంది అనే కాన్సప్ట్ “పీకే” ఈ సినిమాలన్నీ రాజ్ కుమార్ హిరానీ స్థాయిని పెంచుకుంటూ వెళ్లాయి, ఇప్పుడు రాజ్ కుమారి హిరానీ సినిమా కోసం ఆడియన్స్ కళ్ళు కాయలు కాచేలా వెయిట్ చేస్తారు అనేది అతిశయోక్తి కాదు.

ఎస్.ఎస్. రాజమౌళి
మాములుగా ఇండస్ట్రీ లో జనాల నాడీ తెలియాలి అంటారు.
నిజంగా ఆ కాన్సెప్ట్ ఉంటే, దానిలో రాజమౌళి మాస్టర్ అని చెప్పొచ్చు. ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ తెలుగు సినిమాను శిఖరం మీద కూర్చోబెట్టాడు ఈ దర్శకదీరుడు.
ఊహ వేరు ఊహను వెండితెరపై ఆవిష్కరించడం వేరు,
ఊహలు అందరికి వస్తాయి, కొందరు దానిని కాగితం వరకే పరిమితం చేస్తారు, కానీ రాజమౌళి కొంచెం ముందడుగు వేసి ఆ ఊహను ఆడియన్స్ కళ్ళ ముందు పెట్టాడు. వరుస హిట్ లు కొట్టాడు ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తల తిప్పుకునేలా చేసాడు.

- Advertisement -

ప్రశాంత్ నీల్
ఉగ్రం సినిమా వరకు కన్నడలో మాత్రమే వినిపించిన పేరు ఇది.
కానీ ఇప్పుడు “ప్రశాంత్ నీల్” అంటే పరిచయం అవసరం లేదు.
పేరులో మాత్రమే ప్రశాంతత ఉన్న, ఈయన సినిమాలు మాత్రం విధ్వంసం అని రుజువు చేసాడు.
ఇండస్ట్రీ జాతకాన్ని ఒక ఫ్రైడే మార్చేస్తుంది అంటారు. మాములుగా వచ్చిన సినిమాలు కొన్ని సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద కలక్షన్స్ కుమ్మరిస్తాయి. అలానే వచ్చిన కేజీఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఇండస్ట్రీ ను షేక్ చేసింది. ఎక్కువ శాతం తెలుగులో వచ్చిన సీక్వెల్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి, కానీ కేజీఎఫ్ సీక్వెల్ గా వచ్చిన కేజీఎఫ్-2 బాక్స్ ఆఫ్ కా బాప్ అనిపించింది. ఇప్పుడు సలార్ కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారా.?

ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఈ దర్శకులు
చాలామందికి దిశా నిర్దేశకులు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు