Love Today: వన్ ఇయర్ బ్యాక్ ఒకడు వచ్చాడు , కోట్లు కొల్లగొట్టాడు

సినిమాలలో కోట్లు కొల్లగొట్టాలంటే పెద్ద పెద్ద బడ్జెట్ లు భారీ విఎఫ్ఎక్స్ లు అవసరం లేదు. ఒక సరైన కంటెంట్ పట్టుకొని రంగంలోకి దిగితే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని చాలామంది యువ దర్శకులు ఇప్పటికే ప్రూవ్ చేశారు. ఇకపోతే తెలుగులో రీసెంట్ టైమ్స్ లో చాలామంది యంగ్ డైరెక్టర్ సినిమా యొక్క ఇమేజ్ ని సినిమా యొక్క తీరుని మార్చి, ఎవరికి అందని అద్భుతమైన కాన్సెప్ట్స్ ను తీసుకొచ్చి డైరెక్టర్ గా నిలదొక్కుకున్నారు.

Read More: Ivana: అయ్యో.. పాపం లవ్ టుడే హీరోయిన్ పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది

అలానే తమిళ్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక దర్శకుడు ఒక మామూలు కాన్సెప్ట్ ని తీసుకొచ్చి 100 కోట్లు కొల్లగొట్టాడు. ఆ దర్శకుడు పేరు ప్రదీప్ రంగనాథన్. ఆయన తెరకెక్కించిన సినిమా పేరే “లవ్ టుడే”. ప్రదీప్ రంగనాథన్ షార్ట్ ఫిలిం గా డైరెక్టర్ గా కెరియర్ మొదలుపెట్టి తన కెరీర్ లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసాడు. కోమాలీ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్ రంగనాథన్. ఆ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా తర్వాత ప్రదీప్ చేసిన సినిమా “లవ్ టుడే”.

- Advertisement -

ఈ సినిమా తమిళంలో రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఒక అబ్బాయి అమ్మాయి తమ ఫోన్లను మార్చుకుంటే అది తరువాత వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి ఎటువంటి ఆటంకం అయింది. ఫోన్లు మార్చుకోవటం వలన జరిగిన పరిణామాలు ఏంటి చివరికి వాళ్ళ ప్రేమ నిలబడిందా? అపార్ధాలు వలన ముగిసిపోయిందా.? అసలు ఫోన్ వలన యూజ్ ఏంటి.? అసలు మనుషులు అనేవాళ్ళు ఎలా ఉంటారు. అని అద్భుతంగా చూపించాడు ప్రదీప్.

Read More:   Love Today: డబ్బింగ్ సినిమాకే ఎక్కువ

ఎవరూ లేనప్పుడు నువ్వు ఎలా ఉంటావో అది నీ క్యారెక్టర్ అనే అంశాన్ని చాలా చక్కగా చూపించాడు ప్రదీప్ రంగనాథన్. ఈ సినిమాని ప్రదీప్ తెరకెక్కించిన తీరు యూత్ కి క్రేజీగా ఎక్కింది. ఈ సినిమాని తెలుగులో కూడా విడుదల చేసి అద్భుతమైన సక్సెస్ అందుకున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందించారు. తమిళంలో మాదిరిగానే తెలుగులో కూడా ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు.

కేవలం కలెక్షన్స్ ను మాత్రమే కాకుండా ఎన్నో ప్రశంసలు ఈ సినిమా తీసుకొచ్చింది. ప్రదీప్ కెరియర్ లో తన రెండవ సినిమా 100 కోట్లు వసూలు చేయటం అనేది గ్రేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రదీప్ నుంచి ఒక సినిమా వస్తుంది అంటే క్యూరియాసిటితో ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. సంచలనం సృష్టించిన ఈ సినిమాకి నేటితో సరిగ్గా ఒక ఏడాది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు