ఉలగ నయగన్ కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ సౌత్ ఇండస్ట్రీ లో ఎవరకి లేదు. ఆయిన నటనకు ఎంతో మంది స్టార్ నటులు కూడా ఫ్యాన్స్ గా మారిపొయారు. కమల్ హాసన్ ఎంచుకునే భిన్నమైన కథలకి చాలా మంది అభిమానులు ఉన్నారు. కొత్త కొత్త స్టైల్స్ తోపాటు విభిన్న పాత్రలు చేస్తూ దేశమంతటా ఫాలోయింగ్ ను తెచ్చుకున్నారు. అందుకే ఆయనను అందరూ లోకనాయకుడు అని పిలుస్తారు. నాటి స్వాతి ముత్యం నుంచి నేటి విక్రమ్ దాకా కమల్ స్టోరీస్ డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేసారు. కంటెంట్ బాగుంటే హీరో వయసుతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని విక్రమ్ సినిమాతో రుజువు అయింది.
కాగా కమల్ హాసన్ తర్వాత సినిమా స్టార్ డైరెక్టర్ మణిరత్నంతో ఉండబోతున్న విషయంం తెలిసిందే. మణిరత్నం ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ప్రస్తుతంతో ఆయన పొన్నియిన్ సెల్వన్ తో పాటు కమల్ తో మరో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు.
Read More: Nani: ఒక్క హిట్ పడగానే రేటు పెంచిన హీరో..!
కమల్ హాసన్, మణి రత్నం కాంబినేషన్ లో 37 ఏళ్ల క్రితం నాయగన్ (తెలుగులో నాయకుడు) అనే సినిమా వచ్చింది. ఈ చిత్రం ఆ రోజుల్లో బ్లాక్ బస్టర్ హిట్. తమిళంలో 200 రోజులు, తెలుగులో 100 రోజులు చాలా సెంటర్ లలో ఆడింది ఈ సినిమా. ఈ స్టార్ కాంబో మరోసారి సెట్ కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుంది. అదేంటంటే ? ఈ చిత్రంలో ఏడుగురు స్టార్స్ గెస్ట్ రోల్స్ చేయబోతున్నారట. అన్ని సౌత్ ఇండస్ట్రీలతో పాటు బాలీవుడ్ నుంచి కూడా ఓ స్టార్ ఈ చిత్రంలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మలయాళ స్టార్ మమ్మూట్టి, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా కోలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు.
Read More: Hi Nanna : ఫస్ట్ డే వరస్ట్ కలెక్షన్స్… నానికి మరో డిజాస్టర్ పడినట్టేనా?
For More Updates :
Grab Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్...
టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా...
తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి...
నేహా శెట్టి.. ఈ పేరుకంటే రాధిక అని పిలిస్తేనే...
ప్రస్తుతం చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ తో...