Vijay Devarakonda : రేపు అంతా మారబోతోందా ? అసలేం చెప్పాలి అనుకుంటున్నాడు ?

విజయ్ దేవరకొండ… ఈ పేరుకు ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి సినిమాల తర్వాత ఇప్పటిదాకా ఈ హీరోకు సరైన హిట్ పడనేలేదు. పాన్ ఇండియా ఎంట్రీ మూవీ “లైగర్” కూడా నిరాశపరిచింది. అయినప్పటికీ విజయ్ దేవరకొండ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గకపోగా ఇంకాస్త పెరిగింది. బాలీవుడ్ హీరోయిన్లు సైతం మన రౌడీ హీరో అంటే పడి చచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో “ఫ్యామిలీ స్టార్” అనే సినిమాలో నటిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీని వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి సంక్రాంతి బరిలోకి దింపే ప్రయత్నాల్లో ఉన్నాడు.

ప్రస్తుతం ఈ రౌడీ హీరో ఫోకస్ అంతా “ఫ్యామిలీ స్టార్” మూవీ పైనే ఉంది. ఐరనే వంచాలా ఏంటి? అనే ఒకే ఒక్క డైలాగ్ తో ఈ సినిమాపై హైప్ గ్రాఫ్ బాగానే పెంచేశాడు. అయితే ఈ మూవీ సంక్రాంతి బరిలో నుంచి తప్పుకోనుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జరిగిన ఈ మూవీ షూటింగ్ పై దిల్ రాజు అసంతృప్తిగా ఉన్నాడని, డైరెక్టర్ పరశురామ్ ను కొన్ని సన్నివేశాలు రీషూట్ చేయాల్సిందిగా కోరినట్టు రూమర్స్ వస్తున్నాయి. అయితే ఆ రూమర్స్ అన్నిటికి పుల్ స్టాప్ పెడుతూ నోయిడాలో తాజా షెడ్యూల్ స్టార్ట్ చేశారు “ఫ్యామిలీ స్టార్” టీం. అంతేకాకుండా ఈనెల 29న టీం మొత్తం షూటింగ్ కోసం యూఎస్ కు వెళ్లబోతోంది. అక్కడ 15 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా తాజాగా విజయ్ దేవరకొండ “రేపు అంతా మారబోతోంది” అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. మరి 24 గంటల తర్వాత ఈ హీరో దేనికి సంబంధించిన అప్డేట్ ఇవ్వబోతున్నాడు ? అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. కాగా ఇప్పటికే విజయ్ దేవరకొండ రౌడీ వేర్ అనే ఫ్యాషన్ బ్రాండ్ నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ రౌడీ హీరో రేపు ఇవ్వబోయే అప్డేట్ దీని గురించే నని సమాచారం.

- Advertisement -

విజయ్ దేవరకొండ గురించి ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మరో న్యూస్ రష్మిక మందన్న. ఈ స్టార్స్ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని, ఎప్పటికప్పుడు వాళ్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలలో ఏదో ఒక కామన్ లింక్ వెతుకుతూ ఉంటారు నెటిజన్లు. అందుకు తగ్గట్టుగానే రీసెంట్ గా ఈ “యానిమల్” సినిమా ప్రమోషన్స్ కోసం “అన్ స్టాపబుల్” షోకు గెస్ట్ గా వచ్చిన రష్మికను బాలయ్య ఇరికించేసాడు కూడా. క్లారిటీ అయితే ఇవ్వలేదు కానీ వీరిద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తుంది అనే విషయాన్ని మాత్రం చెప్పకనే చెప్పాడు. మరి 24 గంటల తర్వాత విజయ్ దేవరకొండ ఇవ్వబోతున్న అప్డేట్ ఏంటి? అనే విషయంపై ఇప్పుడు ఆయన అభిమానుల్లో చర్చ నడుస్తోంది. అసలు విజయ్ దేవరకొండ ఏం చెప్పాలనుకుంటున్నాడు ? అనే విషయం తెలియాలంటే రేపటి దాకా ఆగాల్సిందే.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు