Maheshbabu: రాజమౌళి బాటలో మహేష్ బాబు.. ఖుషీ అవుతున్న ఫ్యాన్స్..!

Maheshbabu:  సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం.. ఈ చిత్రానికి డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించారు.. గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్స్ పరంగా భారీగానే రాబట్టింది. హీరోయిన్గా శ్రీ లీల , మీనాక్షి చౌదరి నటించారు.. ఇప్పటివరకు రూ .200 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది.. ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వం లో సినిమా చేయడానికి సిద్ధం అయ్యారు..RRR సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న డైరెక్టర్ గా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న రాజమౌళి.. త్వరలోనే మహేష్ బాబు తో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.

ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించి కథ పూర్తి అయ్యిందని.. స్టార్ రైటర్ గా పేరుపొందిన విజయేంద్ర ప్రసాద్(రాజమౌళి తండ్రి).. ఈ సినిమా కథ పూర్తి చేసినట్టు తెలిపారు. ఇకపోతే ఈ సినిమాను రూ.1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందనే టాక్ కూడా వినిపిస్తున్నది. ఇదంతా ఇలా ఉండగా మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి బాటలోని నడుస్తున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాకు మహేష్ బాబు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం మహేష్ బాబు ఒక్కో చిత్రానికి రూ .80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

కానీ రాజమౌళి సినిమా కోసం మాత్రం ఏకంగా రూ .150 కోట్ల వరకు అందుకోబోతున్నారని గతంలో వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు రెమ్యూనరేషన్ కింద ఒక రూపాయి కూడా తీసుకోకుండా… ఈ సినిమా లాభాలలో వాట తీసుకోబోతున్నారని సమాచారం.. బాహుబలి మూవీ నుంచే రాజమౌళి ఇలా రెమ్యునరేషన్ కాకుండా లాభాలలో వాటా తీసుకుంటున్న విషయం తెలిసిందే .. మహేష్ బాబు కూడా రాజమౌళి బాట పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా కోసం మహేష్ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. మరి ఎవరెవరు ఇందులో ఉంటారో చూడాలి మరి. ప్రస్తుతం SSMB -29 చిత్రానికి సంబంధించి ఈ న్యూస్ అయితే వైరల్ గా మారుతోంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు