Mahesh Babu : ఇదే చివరి సినిమా… మహేష్ కామెంట్స్ మీనింగ్ ఇదేనా?

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన లేటెస్ట్ మూవీ “గుంటూరు కారం”. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో ఇదే తన చివరి సినిమా అంటూ ఊహించని విధంగా మహేష్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. మహేష్ బాబు ఇచ్చిన ఈ స్టేట్మెంట్ వెనక దాగున్న అసలు అర్థం ఏంటి అనే విషయాన్ని డీకోడ్ చేసే పనిలో పడ్డారు నెటిజన్లు. మరి ఇంతకీ మహేష్ కామెంట్స్ కి అర్థం ఏంటి? అంటే…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ జనవరి 12న భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు నెగిటివ్ టాక్, మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. అయితే సినిమా ఎలా ఉన్నప్పటికీ మహేష్ బాబు పర్ఫామెన్స్ మాత్రం అదిరిపోయిందనే టాక్ నడుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి జరిగిన ఇంటర్వ్యూలో మహేష్ బాబు, శ్రీలీల పాల్గొన్నారు. పాపులర్ యాంకర్ సుమ ఇంటర్వ్యూలో హీరో హీరోయిన్ల నుంచి పలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టింది.

ఒకానొక సమయంలో మహేష్ మాట్లాడుతూ ఈ సినిమాలో కనీసం రెండు పాటలు బాగా చేయాలని తాను త్రివిక్రమ్ ముందు నుంచే ఫిక్స్ అయ్యామని, ఎందుకంటే ఆ తర్వాత రెగ్యులర్ తెలుగు సినిమా పాటలు చేస్తాను లేదో తనకు తెలియదని, తనకు తెలిసినంతవరకు ఇదే తన చివరి తెలుగు సినిమా అయ్యి ఉండొచ్చని చెప్పుకొచ్చారు. అంటే డాన్స్ నెంబర్స్ లో పరంగా చూసుకుంటే ఇదే తన చివరి సినిమా అవ్వచ్చని మహేష్ అన్నారు.

- Advertisement -

టాలీవుడ్ లో మసాలా ఐటమ్ సాంగ్స్ చేయడానికి తనకు మరొక అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదని, మళ్లీ తను రెగ్యులర్ కమర్షియల్ తెలుగు సినిమాలు చేయడానికి కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నామని అన్నారు.

మహేష్ బాబు కామెంట్స్ ను బట్టి చూస్తే నెక్స్ట్ తాను రాజమౌళి దర్శకత్వంలో చేయబోయే సినిమాకు రెడీ అవుతున్నాడని, ఇక తాను ఆ సినిమా కోసం కొన్ని సంవత్సరాల పాటు తెలుగు సినిమాను విడిచి పెట్టడానికి మానసికంగా సిద్ధమైనట్టు అనిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు మహేష్ తాను కేవలం తెలుగు సినిమాలు మాత్రమే చేస్తానని గర్వంగా చెప్పేవాడు. ఒకవేళ హిందీ లేదా ఇతర భాష సినిమాలు చేయడం గురించి ఎప్పుడైనా ప్రస్తావన వచ్చినా జోక్ వేసి సైలెంట్ అయ్యేవాడు.

కానీ ఇప్పుడు మహేష్ ఫ్రెండ్ ను ఫాలో అవుతూ రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. మరి ఈ ప్రాజెక్టు తర్వాత మహేష్ కేవలం ఫ్యాన్ ఇండియా సినిమాలకు మాత్రమే పరిమితం అవుతాడా? లేదంటే మామూలుగానే రెగ్యులర్ కమర్షియల్ రీజనల్ సినిమాలు కూడా చేస్తారా? అనేది చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు