Tollywood Director: పాన్ ఇండియా రేంజ్‌లో ఫెయిల్ అయిన డైరెక్టర్స్ వీళ్లే!

టాలీవుడ్ డైరెక్టర్స్ అందరి దృష్టి ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలపైనే ఉంది. దేశవ్యాప్తంగా విడుదలయ్యే సినిమాలతో తమ టాలెంట్ ఏంటో నిరూపించుకోవడానికి ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి మొదలుకొని సుకుమార్, సందీప్ రెడ్డి వంగ వంటి డైరెక్టర్స్ ఇండియాలోనే అతిపెద్ద సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ డైరెక్టర్లను తలదన్నే విధంగా సినిమాలను రూపొందిస్తూ ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ పేరు మార్మోగిపోయేలా చేస్తున్నారు. కానీ కొంతమంది దర్శకులు మాత్రం ఫ్యాన్ ఇండియా డైరెక్టర్ గా ముద్ర వేయడంలో ఫెయిల్ అయ్యారు. మరి ఆ డైరెక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

1. సుజిత్

Sujeeth These are the Telugu directors who failed in the Pan India range!
“బాహుబలి” వంటి అద్భుతమైన విజయాన్ని అందుకున్న తర్వాత ప్రభాస్ కి దర్శకత్వం వహించే బాధ్యత యంగ్ డైరెక్టర్ సుజిత్ కి దొరికింది. ఫలితంగా ప్రభాస్ – సుజిత్ కాంబోలో “సాహో” అనే యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్దగా కనెక్ట్ కాలేకపోయారు. దీంతో సుజిత్ పాన్ ఇండియా డైరెక్టర్ గా ఫెయిల్ అయ్యాడు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికి “సాహో” ప్రస్తావన వస్తే అది హాలీవుడ్ రేంజ్ మూవీ అంటూ పొగుడుతూ ఉంటారు.

- Advertisement -

2. రాధాకృష్ణ

Radhakrishna These are the Telugu directors who failed in the Pan India range!
ప్రభాస్ వంటి ఫ్యాన్ ఇండియా హీరోతో సినిమా తీయగల అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయిన మరో డైరెక్టర్ రాధాకృష్ణ. “రాధే శ్యామ్” సినిమాతో ప్రభాస్ కు డిజాస్టర్ మూవీని ఇచ్చి, పాన్ ఇండియా దర్శకుడిగా పూర్తిగా అపజయాన్ని చవిచూశారు డైరెక్టర్ రాధాకృష్ణ.

3. క్రిష్

Krish Jagarlamudi These are the Telugu directors who failed in the Pan India range!
డైరెక్టర్ క్రిష్ కు “మణికర్ణిక” అనే సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారే అవకాశం వచ్చింది. కానీ పలు వివాదాల కారణంగా ఆ సినిమా నుంచి క్రిష్ బయటకు వచ్చేసాడు. మొత్తానికి అలా ఒక పాన్ ఇండియా సినిమా ఈ డైరెక్టర్ చేయి జారిపోయింది. క్రిష్ ఈ మూవీ నుంచి బయటికి వచ్చిన తర్వాత కంగనా రౌనత్ దర్శకత్వం వహించింది.

4. పూరి జగన్నాథ్

Puri Jagannath These are the Telugu directors who failed in the Pan India range!
పూరి జగన్నాథ్ నుంచి సినిమా వస్తుంది అంటే మినిమం అంచనాలు ఉంటాయి. అయితే ఈ దర్శకుడు తనకు వచ్చిన పాన్ ఇండియా అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఈయనను నమ్మి అవకాశం ఇచ్చిన విజయ్ దేవరకొండకు “లైగర్” సినిమాతో ఆయన కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ను ఇచ్చాడు. విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరో, బాలీవుడ్ లోని మంచి స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో ఉన్నప్పటికీ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో “లైగర్” మూవీని తీయడంలో పూరి పూర్తిగా చేతులెత్తేశాడు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు