Tollywood: టాలీవుడ్లో మళ్లీ హనుమాన్ శకం మొదలు.. నెటిజన్స్ ఏమంటున్నారంటే..?

Tollywood: సంక్రాంతికి విడుదలైన హనుమాన్ చిత్రంతో దేశం మొత్తం భక్తి మోడ్ లో పరవశించి పోతున్నారు. ముఖ్యంగా ఇప్పటి భాషలో చెప్పాలి అంటే ఆంజనేయస్వామి ఒక సూపర్ హీరో.. ఎవరికి భయం కలిగినా.. ముందుగా తలుచుకునే పేరే ఆంజనేయస్వామి.. ఇక ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కానీ గుడి కానీ లేని ఏ ఊరు ఉండదు. హనుమంతుడిని చూడగానే మనసులో ధైర్యం వచ్చేస్తుంది. అందుకే ఆయన గురించి ముందు తరాలకు , బయట దేశాలకు కూడా తెలియజేయడానికి ఇప్పుడు ఆంజనేయ స్వామి రిఫరెన్సులతో సినిమాలు వస్తున్నాయి.

వాస్తవానికి గతంలో కూడా ఇలా ఆంజనేయస్వామి రిఫరెన్సుతో వచ్చిన సినిమాలు చాలానే ఉన్నాయి. అంతేకాదు హనుమంతుడి మీద పాటలు కూడా వచ్చాయి. హీరోకి దెబ్బలు తగిలితే హనుమంతుడి కరుణతోనే తగ్గిపోతాయి. హీరో భయపడితే హనుమంతుడిని తలుచుకుంటాడు. ఇలా ఇప్పటికే జగదేకవీరుడు అతిలోకసుందరి, సుప్రీం, శ్రీ ఆంజనేయం, ఊసరవెల్లి వంటి పలు సినిమాలు ఈ తరహాలోనే తెరకెక్కడం గమనార్హం. అయితే చాలా రోజుల తర్వాత హనుమాన్ సినిమాతో మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమలో హనుమాన్ శకం మొదలైందని చెప్పవచ్చు. ఆది పురుష్ సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇందులో ఆంజనేయ స్వామి పాత్రను కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ కాంబోలో వచ్చిన హనుమాన్ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అంతేకాదు ఈ సినిమా ఏకంగా రూ .100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది .దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఆంజనేయస్వామి హాట్ టాపిక్ అయ్యారు.. రాబోయే సినిమాలలో కనీసం ఆయన విగ్రహమైన ఉండాలని దర్శక నిర్మాతలతో పాటు హీరోలు కూడా కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి మొదటి నుంచి హనుమంతుడి భక్తుడని అందరికీ తెలిసిందే. ఇక హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా ఆయన గెస్ట్ గా వచ్చారు. అలాగే తాను నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా హనుమంతుడు రిఫరెన్స్ ఉందని తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన విశ్వంభర గ్లింప్ లో ఒక భారీ హనుమంతుడి విగ్రహాన్ని చూపించారు.

- Advertisement -

ఇక మరొకవైపు హీరో నిఖిల్ కూడా తన నెక్స్ట్ సినిమాలో హనుమంతుడి రిఫరెన్స్ ఉంది అని తెలిపారు. స్వయంభు అనే భారీ పీరియాడికల్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా జైశ్రీరామ్ అంటాము అంటూ నిఖిల్ ఒక వీడియో రిలీజ్ చేశారు మొత్తానికైతే రాబోయే సినిమాలన్నీ కూడా ఇలా హనుమంతుడు రిఫరెన్స్ తో వస్తూ ఉండడం గమనార్హం..ఈ విషయం తెలిసి నెటిజెన్లు కూడా భావితరాలకు సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే హనుమాన్ శకం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో మొదలైందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు