Teja Sajja: ఇంట్రెస్టింగ్‌గా హనుమాన్ హీరో లైనప్… ఇది పాన్ ఇండియా రేంజ్ అంటే..

Teja Sajja:  హనుమాన్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో తేజ సజ్జ. ఇప్పటి వరకు చిన్న చితిక సినిమాలు చేసిన తేజకు హనుమాన్ కెరీర్ లో భారీ సినిమాగా నిలవడమే కాదు. మర్చిపోలేని హిట్ ను కూడా ఇస్తుంది. ఇప్పటికే 100 కోట్ల మార్క్ అందుకున్న ఈ మూవీ, రానున్న రోజుల్లో మరిన్ని అద్భుతాలు చేసే అవకాశం ఉంది.

అయితే హనుమాన్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ ఎలాంటి సినిమాలు చేయబోతున్నాడు అనే ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో వస్తుంది. ఎందుకంటే, హీరోకు ఎదైనా బ్లాక్ బస్టర్ హిట్ పడ్డ తర్వాత వచ్చిన క్రేజ్ ను నిలుపుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. మరి దీన్ని యంగ్ హీరో తేజ సజ్జ ఎలా ఎదుర్కొంటాడు అని చాలా మంది చూస్తున్నారు. అందుకే తేజ నుంచి తర్వాత వచ్చే సినిమాలపై అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు.

నిజానికి తేజా సజ్జ… హనుమాన్ తో పాటు మరో సినిమాను కూడా లైనప్ చేసుకున్నాడు. దీనికి ఈ మధ్యనే సినిమాటోగ్రాఫర్ నుంచి దర్శకుడిగా మారిన కార్తిక్ ఘట్టమనేని డైరెక్టర్. ఇది ఒక మల్టీ స్టారర్ మూవీ అని తెలుస్తుంది. తేజా సజ్జతో పాటు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌తో పాటు మంచు మనోజ్ కూడా ఈ సినిమాలో ఉన్నట్టు తెలుస్తుంది. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది.

- Advertisement -

తేజా సజ్జపైన 40 కోట్లు పెట్టడం అంటే, ధైర్యంతో కూడిన పనే. కానీ, ప్రస్తుతం హనుమాన్ విజయంతో పెట్టిన బడ్జెట్ తిరిగి వస్తుందనే నమ్మకం ప్రస్తుతం ప్రొడ్యూసర్స్ లో ఉందని తెలుస్తుంది. అలాగే దుల్కర్ సల్మాన్ లాంటి హీరో ఉండటం మరో ప్లస్ పాయింట్.

దీంతో పాటు తేజా సజ్జ మరో సినిమాకు కూడా సైన్ చేసినట్టు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. రవితేజకు ధమాకా లాంటి హిట్ ఇచ్చిన త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఓ సినిమా రాబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి రాజేష్ దండా ప్రొడ్యూసర్. వీటితో పాటు హనుమాన్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ మూవీ ఉండనే ఉంది. ఇలా హనుమాన్ తర్వాత మూడు సినిమలతో తన లైనప్ ను తేజా సజ్జ చాలా స్ట్రాంగ్ గా పెట్టుకున్నాడు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు