Tollywood: ఆల్కాహాల్ ను ప్రమోట్ చేస్తున్న స్టార్స్… ఫ్యాన్స్ కి ఏం సందేశం ఇద్దామని?

Tollywood: ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే సీనియర్ హీరోలు నటించిన మూడు పెద్ద సినిమాల్లో సరిగ్గా గమనిస్తే ఒక కామన్ పాయింట్ కనిపిస్తుంది. ఆ పెద్ద సినిమాలలో నటించిన స్టార్ హీరోలు తమ సినిమాల ద్వారా ఆల్కహాల్ ను బాగా ప్రమోట్ చేస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు “గుంటూరు కారం” సంక్రాంతి కానుకగా జనవరి 12న, విక్టరీ వెంకటేష్ “సైంధవ్” జనవరి 13న, కింగ్ నాగార్జున “నా సామి రంగ” సినిమా జనవరి 14న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు సినిమాలు కూడా మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా అనిపిస్తాయి. స్క్రీన్ కి ఏదో ఒక మూల రూల్ ను ఫాలో అవుతూ మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం అనే లైన్ కనిపించీ కనిపించనట్టు వేయడం మాత్రం కామనే. “గుంటూరు కారం” సినిమాలో “మావా ఎంతైనా”, “సైంధవ్” సినిమాలో ఓ పాట, “నా సామి రంగ” సినిమాలో “సీసా మూత ఇప్పుడు” అనే పాటలో హీరోలు ఆల్కహాల్ ను సేవిస్తూ దాని గొప్పతనాన్ని కీర్తించడం కనిపిస్తుంది.

ఇక “గుంటూరు కారం”, “నా సామి రంగ” సినిమాల ప్రమోషనల్ పోస్టర్ల దగ్గర నుంచే మహేష్ బాబు, నాగార్జున బీడీలు తాగుతూ కనిపించారు. ఇలా మొత్తానికి కొంతమంది హీరోలు మద్యపానాన్ని, ధూమపానాన్ని తాగమని తమ సినిమాల ద్వారా ప్రేక్షకులను ప్రోత్సహిస్తున్నట్టుగా ఉంది. మరి హీరోలు తమ అభిమానులకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారో వాళ్లకే తెలియాలి.

- Advertisement -

సినిమాను సినిమా లాగా చూడాలి. అంతేగాని సినిమాలో హీరోలు తాగినంత మాత్రాన బయట జనాలు మందు తాగుతారా? హీరోలు ఆపమంటే ఆపుతారా? తాగాలా వద్దా అనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం నడుస్తున్న ఈ డిజిటల్ యుగంలో సినిమాలు, సినిమాల్లో నటించే స్టార్స్ ఎఫెక్ట్ యూత్ పై గట్టిగానే ఉంటుంది. తమ అభిమాన నటులు సినిమాల్లో ఎలా కనిపిస్తారో తాము కూడా అలాగే ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు.

సాధారణ జీవితంలో ఈ స్టార్స్ అంతా ఎలా ఉంటారో వాళ్లకు తెలియదు కాబట్టి, సిల్వర్ స్క్రీన్ పై హీరో కనిపించే తీరులో తమను తాము ఊహించుకుంటారు. అందుకే వాళ్ళు స్క్రీన్ పై ఏం చెప్పినా ఇట్టే నమ్మేస్తారు. వాళ్లలా తమను తాము మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి హీరోలు వెండితెరపై ఎలా నడుచుకుంటున్నారు అనే విషయం వాళ్ళ అభిమానులను గట్టిగా ప్రభావితం చేస్తుంది అనేది వాస్తవం.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు