Telugu Movies: డివోషనల్ సెంటిమెంట్… అందరి కన్ను నార్త్ పైనే..!

తెలుగు సినిమాలంటే… కొద్ది రోజుల ముందు నార్త్ వాళ్లకు చిన్న చూపు ఉండేది. కానీ ఇటీవల స్టార్ హీరోల సినిమాలు మంచి కంటెంట్‌తో రావడం వల్ల ఇప్పుడు నార్త్ వాళ్లు బాలీవుడ్ సినిమాల కంటే, తెలుగు సినిమాలపైనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు స్టార్ హీరోల నుంచే కాదు… టైర్ 2, టైర్ 3 హీరోల నుంచి మంచి కంటెంట్ సినిమాలు వచ్చినా, నార్త్ లో హిట్ అయిపోతున్నాయి. ముఖ్యంగా డివోషనల్ సెంటిమెంట్ ను తెలుగు డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు గట్టిగా పట్టుకున్నారు.

డివోషనల్ కాన్సెప్ట్‌తో సినిమాలు చేసి నార్త్ వాళ్లపైకి వదులుతున్నారు. రెండు ఏళ్ల క్రితం యంగ్ హీరో నిఖిల్ నుంచి వచ్చిన కార్తికేయ 2 మూవీ ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. కేవలం 15 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఆ మూవీ వంద కోట్ల మార్క్ ను అందుకోవడమే కాకుండా, ఫుల్ రన్‌లో 121 కోట్లను కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతలా కలెక్షన్లు రావడానికి కారణం… నార్త్ ఆడియన్సే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సౌత్ ఆడియన్స్ కంటే… నార్త్ ఆడియన్స్ కు భక్తి భావాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. ఈ పాయింట్ ను క్యాచ్ చేసుకుని క్యాష్ చేసుకుంటున్నారు తెలుగు నిర్మాతలు. అలా ప్లాన్ చేసుకుని వచ్చిందే… ఇప్పటి హనుమాన్ మూవీ. సంక్రాంతికి తెలుగు బాక్సాఫీస్ వద్ద టఫ్ ఫైట్ ఉన్నా… బరిలో నిలిచింది అంటే.. నార్త్ ఆడియన్స్ ను నమ్ముకునే అని స్వయంగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు హనుమాన్ మూవీ 100 కోట్ల మార్క్ అందుకుంది. ఇందులో నార్త్ వాళ్ల వాటానే ఎక్కువ.

- Advertisement -

కార్తికేయ2, హనుమాన్ రిజెల్ట్ చూసిన తర్వాత మరి కొన్ని తెలుగు సినిమాలు కూడా నార్త్ ఆడియన్స్ కు ఉన్న డివోషనల్ సెంటిమెంట్ ను టార్గెట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి – వశిష్ట కాంబోలో వస్తున్న సోషియో ఫాంటసి మూవీ విశ్వంభర గ్లింప్స్ ఇటీవల రిలీజ్ అయింది. అందులో ఓ భారీ హనుమాన్ విగ్రహాన్ని చూపించారు. అంతే కాదు.. ఈ సినిమాలో ఉన్న మూడు లోకాలు కాన్సెప్ట్ కూడా నార్త్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగానే ఉంది.

తాజాగా యంగ్ హీరో నిఖిల్… మరోసారి నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేయబోతున్నాడు. నిఖిల్ నుంచి రాబోతున్న స్వయంభూ మూవీ కూడా డివోషనల్ సెంటిమెట్ తోనే ఉంటుందని, అందులో హీరో పాత్ర హనుమాన్ కు భక్తుడు అంటూ ఇటీవల ఓ సందర్భంలో చెప్పాడు. అంటే.. ఈ సినిమాను కూడా నార్త్ ఆడియన్స్ టేస్ట్ కు అనుకూలంగా తెరకెక్కించబోతున్నట్టు చెప్పకనే చెప్పేశాడు.

ఇలా నార్త్ ఆడియన్స్‌లో ఉన్న డివోషనల్ సెంటిమెంట్ ను టార్గెట్ చేస్తూ సినిమాలను చేస్తున్నారు తెలుగు మేకర్స్. ఈ తరహాలో మరిన్ని తెలుగు సినిమాలు వచ్చిన పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు