Naa SaamiRanga Movie Review: ‘నా సామి రంగ’ మూవీ రివ్యూ

Critic’s Rating
2.5
About the movie
ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో ముందు నుండి జనాలను ఆకర్షించిన సినిమాగా ‘నా సామి రంగ’ నిలిచింది. నాగార్జున ఇది వరకు క్రిస్మస్ సీజన్ ను సెంటిమెంట్ గా భావించేవారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ తర్వాత సంక్రాంతిని సక్సెస్ సీజన్ గా భావిస్తున్నారు. మరి ‘నా సామి రంగ’ మరోసారి నాగ్ సెంటిమెంట్ ను నిజం చేసిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం రండి :

కథ:
ముందుగా ఇది మలయాళంలో సక్సెస్ అందుకున్న ‘పోరింజు మరియం జోస్’ ఆధారంగా రూపొందింది. ‘నా సామి రంగ’ కథ విషయానికి వస్తే కిష్టయ్య (నాగార్జున), అంజి (‘అల్లరి’ నరేష్) అనాథలు. అయితే వీరిని అంబాజీపేట ఊరి ప్రెసిడెంట్ అయిన పెద్దయ్య (నాజర్) చేరదీసి అండగా నిలబడతాడు. ముఖ్యంగా కిష్టయ్య అంటే పెద్దయ్య కి అమితమైన అభిమానం నమ్మకం. మరోపక్క కిష్టయ్య, వరాలు (ఆషికా రంగనాథ్) ప్రేమలో ఉంటారు. పెళ్లి చేసుకుందాం అనుకున్న టైంలో వరాలు తండ్రి వరదరాజులు (రావు రమేశ్) కిష్టయ్య వల్ల జరిగిన చిన్న పొరపాటు వల్ల మరణిస్తాడు. మరోపక్క కిష్టయ్య … పెద్దయ్య కుటుంబంలో ఉన్న వారికి శత్రువు అవుతాడు. కానీ పెద్దయ్య… కిష్టయ్యని వదలడు. కానీ వరాలు.. కిష్టయ్యకి దూరంగా ఉంటుంది. ఇక ప్రెసిడెంట్ కుమార్తె కుమారి (రుక్సార్ థిల్లాన్)తో అంబాజీపేట కుర్రాడు భాస్కర్ (రాజ్ తరుణ్) ప్రేమ వ్యవహారం మరో వైపు. కిష్టయ్య, అంజి, భాస్కర్..లకి ఉన్న స్నేహం ఎలాంటిది? అంజి వల్ల కథ ఎలా మారిపోయింది. చివరికి వరాలు, కిష్టయ్య కలుసుకున్నారా? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
కథగా చెప్పుకోవాలంటే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. చాలా లేయర్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అయితే మాస్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా దర్శకుడు విజయ్ బిన్నీ జాగ్రత్తపడ్డాడు. సంక్రాంతి రోజు మొదలై కనుమ రోజున ముగిసే కథ ఇది. సంక్రాంతికి థియేటర్ కి వచ్చే ప్రేక్షకులను ఆకర్షించే ఎలిమెంట్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ బాగుంటుంది. ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఓకే. అనాధ అయిన హీరో ఇంకో అనాధకి ఫ్రెండ్ అవ్వడం అనేది లారెన్స్ తీసిన ‘డాన్’ సినిమా కాన్సెప్ట్. అనాధ అయిన హీరోని ఫ్రెండ్ అన్నయ్య అని పిలవడం ‘మాస్’ సినిమాలోని ఎమోషన్. అది కూడా లారెన్స్ తీసిందే. అతను కొరియోగ్రాఫర్ అయినప్పటికీ డైరెక్టర్ ని చేసింది నాగార్జున. ఇప్పుడు మరో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని కూడా డైరెక్టర్ ని చేశాడు. లారెన్స్, విజయ్ బిన్నీ.. ఒకేరకమైన పాయింట్ ను తీసుకున్నారు. కానీ నేపధ్యం వేరు. రీమేక్ అనే అడ్డుకట్ట వేరు.ఇదిలా ఉంటే.. ఒరిజినల్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ ను డైరెక్టర్ మలిచిన తీరు కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒరిజినల్లో క్లైమాక్స్ చాలా స్యాడ్ గా ఉంటుంది. కానీ తెలుగులో మార్చారు.. అదే ఇక్కడ ప్లస్ అయ్యింది.

- Advertisement -

దర్శకుడిగా విజయ్ బిన్నీ పాస్ మార్కులు వేయించుకున్నాడు. సినిమా హిట్ అయినా అది సంక్రాంతి పండుగ ఖాతాలోనే పడిపోతుంది. ఇది హడావిడి హడావిడిగా తీసేశాడు కానీ రెండో మూవీతోనే ఇతను బాగా ప్రూవ్ చేసుకోవాలి. కీరవాణి ఈ సినిమాలో చెప్పుకోదగ్గ పాటలు ఏమీ ఇవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. 1980 , 90 ల టైంకి ప్రేక్షకులను తీసుకెళ్లే ప్రయత్నం సినిమాటోగ్రఫీతో చేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు.

నటీనటుల విషయానికి వస్తే.. నాగార్జున కంప్లీట్ మాస్ యాంగిల్ లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఎక్కువ మార్కులు అల్లరి నరేష్ కొట్టేశాడు.ఈ సినిమాతో నటుడిగా అతను ఇంకో మెట్టు పైకి ఎక్కాడు. రాజ్ తరుణ్ జస్ట్ ఓకె.హీరోయిన్లలో ఆషిక రంగనాథ్ బాగా చేసింది. మిగిలిన నటీనటులు పెద్దగా గుర్తుండే పాత్రలు చేయలేదు.

ప్లస్ పాయింట్స్ :

నాగార్జున

అల్లరి నరేష్

ఫస్ట్ హాఫ్

క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

కథలో కొత్తదనం లేకపోవడం

సంగీతం

కామెడీ

మొత్తంగా.. ‘నా సామి రంగ’ కేవలం సంక్రాంతి సీజన్ కోసం తీసిన సినిమా. ఈ పండుగకి పల్లెటూరు, జాతర, ఎమోషన్స్ వంటివి ఏ సినిమాలో ఉంటే ఆ సినిమాకి జనాలు కనెక్ట్ అవుతారు. అలాంటి వారికోసమే ఈ ‘నా సామి రంగ’ తప్ప… టైటిల్ ఉన్నంత పవర్ఫుల్ గా అయితే సినిమా ఉండదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు