Rajinikanth: రజనీకాంత్ పై ఫైరైన పెద్దావిడ.. మనశ్శాంతి లేకుండా పోతోందంటూ..!

Rajinikanth: దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న హీరోలలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఒకరు. ముఖ్యంగా తమిళనాడులో రజనీకాంత్ ని తలైవా అని కూడా అభిమానులు ప్రేమగా పిలుచుకుంటూ ఉంటారు. ఇకపోతే పుట్టినరోజు, పండుగల రోజుల్లో ప్రత్యేకంగా అభిమానులు రజనీకాంత్ ఇంటి ముందు నానా హంగామా చేస్తూ ఉంటారు.. అయితే రజనీకాంత్ కూడా ఎప్పుడు అభిమానులను నిరాశపరచకుండా ఇంటి బయటకు వచ్చి మరి వారికి అభినందనలు తెలిపేవారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రజనీకాంత్ ఇంటి వద్ద అభిమానులు నానా హంగామా చేశారు.

చెన్నైలోని పోయెస్ గార్డ్ లో నివాసం ఉంటున్న రజనీకాంత్ ఇంటి ముందు ఉదయాన్నే వేలాది మంది అభిమానులు గుంపులు గుంపులుగా వచ్చారు. దీంతో ఎప్పటిలాగానే రజినీకాంత్ బయటికి వచ్చి వారిని పలకరించారు.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని దేవున్ని కోరుకుంటున్నాను అంటూ.. ఈ కొత్త సంవత్సరం అందరూ నిజాయితీతో నడుచుకోవాలని.. అప్పుడే జీవితం ప్రశాంతంగా సాగుతుందంటూ అభిమానులకు సూచించినట్లుగా తెలుస్తోంది.. తమ అభిమాన హీరో బయటకు రావడంతో అభిమానులు సైతం పులకించిపోయి తలైవా తలైవా అంటూ చాలా గట్టి నినాదాలు చేశారు.

దీంతో రజనీకాంత్ ఇంటి చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా సందడిగా మారింది .ఇదే సమయంలో రజినీకాంత్ పక్కింట్లో ఉండే ఒక సీనియర్ మహిళకు ఆగ్రహం తెప్పించింది.. ఇదేం లొల్లి ప్రశాంతంగా పండుగను కూడా చేసుకోనివ్వరా అంటూ ఫైర్ అయ్యారు.. అంతేకాకుండా రజనీకాంత్ ఇంటి ముందు ఉండే సెక్యూరిటీ సిబ్బంది , అభిమానులతో కూడా ఆ పెద్దావిడ వాగ్వాదానికి దిగారు.. అంతేకాకుండా ఏం రజనీకాంత్ ఇంటి ద్వారాలు తెరిచి వారిని లోపలికి పిలిపించుకోవచ్చుగా అంటూ ఫైర్ అయ్యింది.

- Advertisement -

ఇలా మా ఇంటి ముందు నిలబడి గట్టి గట్టిగా కేకలు వేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రశాంతంగా దేవుడిని కూడా ప్రార్థించుకోనివ్వరా అంటూ ఆమె మండిపడింది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. అయితే ఈ విషయం రజినీకాంత్ పై మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీల విషయంలో కూడా ఇదే తప్పులు చేస్తున్నారు అభిమానులు. చాలామంది స్టార్ హీరోల ఇంటి ముందు వెళ్లి ఇలా శుభాకాంక్షలు తెలుపుతూ ఉండడమే కాకుండా అక్కడ ఉన్న చుట్టుపక్కల కుటుంబాల వారికి కూడా ఇబ్బందులు కలిగించేలా చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయం పై రజనీకాంత్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు