Pushpa 2: అభిమానులకి గుడ్ న్యూస్.. షూటింగ్ షురూ..!

అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో తెలిసిందే . ఇప్పుడు రెండవ భాగాన్ని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యం అవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. స్క్రిప్ట్ పరంగా, లొకేషన్ పరంగా వీటికి తోడు డేట్స్, పండుగలు ఇతరత్రా కారణాల చేత షూటింగ్ ను కొన్నిసార్లు ఆపేయాల్సి వస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో కీలకమైన పాత్రలో నటించిన కేశవ కూడా అమ్మాయి విషయంలో అరెస్టు కావడం జరిగింది.

ప్రముఖ జూనియర్ ఆర్టిస్టుని వేధించి.. ఆమె ఆత్మహత్యకు కారణమయ్యారనే కేసులో అతడిని అరెస్టు చేశారు. అయితే నేరం ఒప్పుకున్నట్లు తెలియడంతో దీంతో కొద్దిరోజులు జైల్లోనే ఉన్నారు. ఫలితంగా పుష్ప-2 సినిమా షూటింగ్ ఆగిపోయింది. వాస్తవానికి సినిమాలో జగదీష్ తో వచ్చే సన్నివేశాలు చాలానే ఉన్నాయని, ఆయన అరెస్టు కావడంతో చిత్ర బృందానికి చాలా తలనొప్పిగా మారిపోయింది.. అయితే ఈ పాత్రకి మరెవ్వరు సెట్ కారని తీసుకోవడం లేదట. అంతగా తన పాత్ర ఉండబోతుందని తెలుస్తోంది.

ఈ విషయం పుష్ప-2 చిత్ర బృందాన్ని చాలా ఇబ్బంది పెట్టేలా కనిపిస్తోంది అయితే తాజాగా టీం జగదీష్ ని బెయిల్ మీద బయటకు తీసుకు వచ్చినట్లు కనిపిస్తోంది. నేటి నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టబోతున్నారని.. రామోజీ ఫిలిం సిటీ లో కొన్ని జాతర సన్నివేశాలను చిత్రీకరించబోతున్నారట. ఇందులో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కేశవ (జగదీష్) కూడా పాల్గొంటున్నారని సమాచారం.

- Advertisement -

కేశవ ఉన్న సన్నివేశాలను వేగంగా పూర్తి చేసే ఆలోచనలు సుకుమార్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకగా విడుదల చేయబోతున్నారు. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ గెటప్ లో అదరగొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీ వల్లీ పాత్రలో రష్మిక నటిస్తోంది. అలాగే ఫహద్ ఫాజిల్ నెగటివ్ పాత్రలో కనిపించబోతున్నారు. కీలకమైన పాత్రలో అనసూయ , రావు రమేష్, సునీల్ తదితర నటీనటులు సైతం నటిస్తున్నట్లు తెలుస్తోంది. పుష్ప మొదటి భాగాన్ని మించి రెండవ భాగం ఉండబోతుందని.. ఇందులో ప్రతి ఒక్క సన్నివేశాలు కూడా హైలెట్ గా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా షూటింగ్ ప్రారంభం కాబోతుందని తెలిసి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు