Pushpa 2 : తగ్గేదే లే… సుకుమార్ పుట్టినరోజున రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన టీం

ఈ ఏడాది రాబోయే మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాల లిస్టులో “పుష్ప” ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ మూవీ వాయిదా పడబోతోంది అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలపై తాజాగా “పుష్ప” టీం క్లారిటీ ఇచ్చింది. ఈరోజు డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేశారు.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప : ది రూల్” మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. “పుష్ప” మూవీతో డైరెక్టర్ సుకుమార్ తో పాటు అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా వైడ్ గా పాపులారిటీని దక్కించుకున్నారు. ఈ మూవీకి సీక్వెల్ గా వస్తున్న “పుష్ప : ది రూల్’ గురించి దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాదులో శరవేగంగా జరుగుతుంది. ఈ మూవీని 2024 ఆగస్టు 15న విడుదల చేయబోతున్నట్టుగా చాలా రోజుల క్రితమే ప్రకటించారు. అయితే రీసెంట్ గా ఓ బాలీవుడ్ సినిమాకు సంబంధించిన మేకర్స్ తమ సినిమాను కూడా ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయబోతున్నాము అని ప్రకటించడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి. “పుష్ప” లాంటి భారీ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ అవుతుంటే, అదే డేట్ ను బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా లాక్ చేయడంతో “పుష్ప” మూవీ పోస్ట్ పోన్ అవుతుందా? అనే అనుమానం మొదలైంది. అలాగే షూటింగ్ ఇంకా చాలా వరకు పెండింగ్ ఉండడంతో “పుష్ప” టీం కొత్త రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తున్నారు అనే ప్రచారం జరిగింది బాలీవుడ్ మీడియాలో. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్న సింగం అగైన్ మూవీ ఆగస్టు 15న రిలీజ్ అవుతుందని, దీనివల్ల పుష్ప మూవీ కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడుతుందని, అందుకే ఈ మూవీని పోస్ట్ ఫోన్ చేస్తారంటూ రూమర్స్ హల్చల్ చేశాయి.

ఇప్పటికే ఆ వార్తలను కొట్టి పారేసిన “పుష్ప” టీం తాజాగా మరోసారి మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చింది. డైరెక్టర్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా ఈరోజు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రత్యేకమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో సుకుమార్ విజన్ లో “పుష్ప : ది రూల్” గొప్పగా, భారీ ఎత్తున ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాము అంటూ ట్వీట్ చేశారు. దీంతో మరోసారి టాలీవుడ్, బాలీవుడ్ సినిమాల మధ్య మరో బిగ్గెస్ట్ క్లాష్ రావడం ఖాయం అనిపిస్తోంది. ఇక ఈ సందర్భంగా సుకుమార్ కు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాకుండా “పుష్ప 2” మూవీ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చినందుకు బన్నీ ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు