Prabhas: ప్రభాస్ లైనప్ చూస్తే షాక్.. ఏకంగా రూ.6 వేల కోట్లు..!

రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అన్ని పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారే కానీ ఊహించిన సక్సెస్ అయితే అందుకోవట్లేదని చెప్పాలి. దీంతో ఈయన కెరియర్ అయిపోయిందని ఇక ప్రభాస్ మూట మల్లు సర్దేయాల్సిన సమయం వచ్చింది అంటూ కొంతమంది రకరకాల కామెంట్లు చేశారు. అంతేకాదు ఇటీవల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన సలార్ సినిమా కూడా డిజాస్టర్ అవుతుందని కొంతమంది కామెంట్లు చేయగా ..ఈ సినిమా ఊహించని విధంగా సక్సెస్ అందుకోవడమే కాదు పక్కా కమర్షియల్ హిట్ అందించింది.

ఇక ఈ సినిమా తర్వాత ఆయన కల్కి 2898 ఏడి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసింది. సంక్రాంతి సందర్భంగా విడుదల కావాల్సిన ఈ సినిమా గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తికాని నేపథ్యంలో వేసవి సెలవులకు వాయిదా వేశారు చిత్ర బృందం. కల్కి 2898 ఏడి.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా దాదాపు రూ .500 కోట్ల బడ్జెట్ తో రాబోతోంది. ఇందులో కమలహాసన్ , దీపికా పదుకొనే , అమితాబ్ బచ్చన్, దిశా పటాని తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైథాలజికల్ సైన్స్ ఫిక్షన్ మూవీగా ఈ సినిమాను ప్రొజెక్ట్ చేస్తున్నారు నాగ్ అశ్విన్. ఇక కల్కి సినిమా పేరుతోనే రూ.2000 కోట్లు బిజినెస్ ఎస్పెక్ట్ చేస్తున్నాను మేకర్స్.. దాదాపు రూ.1000కోట్ల థియేటర్ బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు ఈ మూవీ రెండు భాగాలుగా రాబోతున్న నేపథ్యంలో రెండింటి పేరుతో రూ.3000 కోట్లు దందా నడుస్తోందని చెప్పవచ్చు.

ఇక మరొకవైపు రెగ్యులర్ తెలుగు కమర్షియల్ మూవీ గా డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో ఓ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కామెడీ, ఫైట్స్, ఫ్యామిలీ ఎలిమెంట్స్, లవ్ రొమాన్స్ తో పాటు హర్రర్ ఎలిమెంట్స్ ఇలా అన్ని మేళవింపుగా.. విందు భోజనంలా ఉండబోతుందని సమాచారం . రూ.200 కోట్ల బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా నుంచి రూ .500కోట్ల కలెక్షన్స్ ఎక్స్పెక్ట్ చేస్తోంది చిత్ర యూనిట్. ఈ సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ మూవీ చేస్తున్నారు . ఇందులో పోలీస్ ఆఫీసర్గా ప్రభాస్ కనిపించబోతున్నారట. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతుందని.. ముఖ్యంగా మూవీ నుంచి రూ.1000 కోట్ల బిజినెస్ జరుగుతుందని భావిస్తున్నారు. కల్కి సినిమా హిట్ అయితే దాన్నిబట్టి రూ .1500 కోట్ల వ్యాపారం ఈ సినిమా పేరుతో జరగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి..

- Advertisement -

ఇక వీటితోపాటు హనురాఘవపూడి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పై కూడా రూ.1000 కోట్లు బిజినెస్ ని ఆశిస్తున్నట్లు సమాచారం. మరొకవైపు మోహన్ బాబు , మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప చిత్రంలో కూడా ప్రభాస్ గెస్ట్ రోల్ లో చేయబోతున్నారు. అలాగే సలార్ 2 సినిమాలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఇలా ప్రభాస్ నటించబోయే ఆరు సినిమాలతో ఏకంగా రూ.6000 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదేమైనా ఒక హీరో పై ఈ రేంజ్ లో వ్యాపారం జరగడం మామూలు విషయం కాదని చెప్పవచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు