Tollywood : టాలీవుడ్ ను కబ్జా చేస్తున్న కన్నడ హీరోయిన్లు… తెలుగు హీరోయిన్లకు చోటేది?

పొరుగింటి పుల్ల కూర రుచి అంటే ఇదేనేమో. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్న వాళ్లంతా ఎక్కడెక్కడ వాళ్ళో. మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెలుగు వాళ్లకు తప్ప మిగతా ఇండస్ట్రీల నుంచి వచ్చే వారికి మంచి డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా ముంబై భామలకు, ఆ తర్వాత తమిళ హీరోయిన్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ ఉంటారు టాలీవుడ్ మేకర్స్. స్వాతి, అంజలి వంటి తెలుగు హీరోయిన్లు ఎంతోమంది ఉన్నప్పటికీ వాళ్లకు స్టార్ స్టేటస్ ఇవ్వడానికి ధైర్యం చేయలేకపోయింది టాలీవుడ్. మంచి టాలెంట్ ఉన్న మన తెలుగు హీరోయిన్లు తెలుగులో తప్ప ఇతర ఇండస్ట్రీలో బాగా రాణిస్తున్నారు.

ఇక తెలుగు హీరోయిన్లకు టాలీవుడ్ లో చోటు ఇవ్వట్లేదు అనే వాదనను ఎవరైనా తెరపైకి తీసుకొస్తే, సినిమాకు భాషతో సంబంధం లేదు అంటూ కవర్ చేస్తారు. పైగా ఎక్కడి నుంచో వచ్చి తెలుగు నేర్చుకుని, టాలీవుడ్ ఆడియన్స్ ను అలరించడానికి ఇంతగా కష్టపడుతున్న హీరోయిన్లపై ఇలాంటి కామెంట్స్ చేయడం సరికాదు అంటూ తమను తాము సమర్ధించుకుంటారు. ఇక ఇప్పటిదాకా ఇతర ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్లు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లుగా ఎదగగా, ఇప్పుడు కన్నడ భామల వంతు వచ్చింది. కన్నడ ఇండస్ట్రీ నుంచి వస్తున్న పలువురు హీరోయిన్లు టాలీవుడ్ లో మకాం వెయ్యడానికి ఇప్పుడు సిద్ధమయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఆ కొరతను భర్తీ చేయడానికి తమిళ హీరోయిన్ అమృత అయ్యర్ తో పాటు కన్నడ భామలు శ్రీలీల, శ్రద్ధ శ్రీనాథ్, ఆషిక రంగనాథ్ వంటి హీరోయిన్లు రెడీ అవుతున్నారు. వీళ్లలో శ్రీలీల ఇప్పటికే తన అందం, చలాకితనం, డాన్స్ వంటి స్కిల్స్ తో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది.

పాన్ ఇండియా మూవీగా జనవరి 12న రాబోతున్న “హనుమాన్” మూవీలో అమృత అయ్యర్, “గుంటూరు కారం” మూవీలో శ్రీలీల, జనవరి 13న రిలీజ్ కాబోతున్న “సైంధవ్” మూవీలో శ్రద్ధ శ్రీనాథ్, జనవరి 14న రాబోతున్న “నా సామి రంగ” మూవీలో ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ హీరోయిన్లందరూ ఈ సంక్రాంతితో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఒకవేళ లక్ తో ఈ సినిమాలు గనక హిట్ అయ్యాయి అంటే టాలీవుడ్ లో కన్నడ బ్యాక్ డ్రాప్ ఉన్న ఈ హీరోయిన్లంతా టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకునే ఛాన్స్ ఉంది. మొత్తానికి ఈ కన్నడ భామలు పెద్ద సినిమాలే పట్టి టాలీవుడ్ ను కబ్జా చేసేసారు. మరి ఫ్యూచర్లో వీళ్ళ కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు