Sreeleela : “గుంటూరు కారం” ఈవెంట్లో శ్రీలీల కట్టిన చీర ధర ఎంతో తెలుసా?

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎనర్జిటిక్ బ్యూటీ శ్రీలీల జంటగా నటిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే “గుంటూరు కారం” ప్రమోషన్లలో భాగంగా గుంటూరులో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈవెంట్లో మహేష్ తో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బాటిల్ గ్రీన్ కలర్ నెట్ శారీలో మెరిసి అందరి దృష్టిని తన వైపుకు తిప్పేసుకుంది శ్రీలీల. మరి ఈ శారీ కాస్ట్ ఎంతో తెలుసా?

“గుంటూరు కారం” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల పల్చటి నెట్ శారీ కట్టుకుని అభిమానుల కళ్ళకు ఆనందాన్ని కలిగించింది. చూడడానికి సింపుల్ గా, ఉల్లి పొరలా పల్చని నెట్ తో ఉన్న ఈ శారీ గురించి, దాని ధర గురించి, అసలు ఆ చీర ఎక్కడ దొరుకుతుంది? అనే విషయాలను సెర్చ్ చేయడం మొదలుపెట్టారు నెటిజెన్లు. అయితే ఈ డిజైనర్ సారీ బాటిల్ గ్రీన్ కట్ వర్క్ సారీ అనే పేరుతో ఆన్లైన్లో అందుబాటులో ఉంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ కామర్స్ వెబ్సైట్లో కాకుండా, ఒక సపరేట్ వెబ్సైట్లో ఈ డిజైనర్ వేర్ శారీ అమ్ముతున్నారు. ఇక దీని ధర తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం. ఈ బ్యూటిఫుల్ బాటిల్ గ్రీన్ డిజైనర్ చీర ధర అక్షరాలా రూ. 1,59,000. ఈ విషయం తెలిసిన నెటిజెన్లు నోరు వెళ్ళబెడుతున్నారు. శ్రీలీల కట్టడంతో పాపులర్ అయిన ఈ చీర డిజైన్ కు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్ లోనే మోస్ట్ వాంటెడ్ క్రేజియెస్ట్ హీరోయిన్ గా మారింది. గత ఏడాది ఈ బ్యూటీ వరుస ప్లాపులు అందుకున్నప్పటికీ ఆమెకున్న డిమాండ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో త్వరలో పట్టాలెక్కబోతున్న మూవీలో శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది . మరోవైపు పవన్ కళ్యాణ్ సరసన “ఓజీ”లో మెరవబోతోంది. ఇక ప్రస్తుతం శ్రీలీల “గుంటూరు కారం” మూవీలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో జోడి కట్టింది. ఈ మూవీ పైనే శ్రీలీల తన ఆశలన్నీ పెట్టుకుంది. “గుంటూరు కారం” మూవీ హిట్ అయితే గనక శ్రీలీలే టాప్ హీరోయిన్ అవుతుంది. ఇక ఈ బ్యూటీ గతంలో లాగా వరుసగా సినిమాలు చేయకుండా, ప్రస్తుతం తన చేతిలో ఉన్న సినిమాలు విడుదలై వాటి ఫలితాలు చూసాకే నెక్స్ట్ మూవీని ఒప్పుకోవాలని డిసైడ్ అయ్యిందని వార్త చెక్కర్లు కొడుతోంది. ఏదైతేనేం శ్రీలీల “గుంటూరు కారం” మూవీతో పక్కా హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు ఆమె అభిమానులు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు