Director Tivikram : గురూజీతో తమిళ స్టార్ హీరో విక్రమ్ గొడవ… ఇప్పటికీ అదే కంటిన్యూ అవుతోందా?

డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు టాలీవుడ్లో స్టార్ హీరోలకు ఉండే భారీ క్రేజ్ ఉంది. ఆయనను అభిమానులంతా ముద్దుగా గురూజీ అని పిలుచుకుంటారు. ఈయనకు ఒకవైపు ఎంత క్రేజ్ ఉందో, మరోవైపు అదే రేంజ్ లో విమర్శలు కూడా వస్తూ ఉంటాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ “గుంటూరు కారం” మూవీ జనవరి 12న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. గురూజీతో తమిళ స్టార్ హీరో విక్రమ్ కు గొడవ జరిగిందనీ, ఇప్పటికీ అది కంటిన్యూ అవుతోందనే వార్త ఇప్పుడు హల్చల్ చేస్తోంది.

రైటర్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రివిక్రమ్ ఆ తర్వాత డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. కేవలం రైటర్ గానే ఏకంగా కోటి రూపాయల పారితోషికాన్ని అందుకుని రైటర్ల వ్యాల్యూ ఏంటో ప్రూవ్ చేశాడు త్రివిక్రమ్. ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో పోసాని కృష్ణమురళి దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేరాడు. ఆ సమయంలోనే త్రివిక్రమ్ కు, ఇప్పటి తమిళ స్టార్ హీరో విక్రమ్ కు మధ్య గొడవ జరిగిందట.

అప్పట్లో పోసాని కృష్ణ మురళి రైటర్ గా పని చేస్తున్న ఓ సినిమా షూటింగ్ లో విక్రమ్ కి చిన్న క్యారెక్టర్ లో నటించే అవకాశం వచ్చిందట. అసిస్టెంట్ రైటర్ గా పని చేస్తున్న త్రివిక్రమ్ ఒక సన్నివేశాన్ని విక్రమ్ కు వివరించారట. ఆ సందర్భంలోనే విక్రమ్, త్రివిక్రమ్ మధ్య ఏదో విషయంలో గొడవ మొదలైందట. దీంతో త్రివిక్రమ్ పై విక్రమ్ ఫైర్ అయ్యాడట. త్రివిక్రమ్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా ప్రవర్తించాడట. అప్పటికి త్రివిక్రమ్ కేవలం అసిస్టెంట్ రైటర్, మరోవైపు విక్రమ్ కూడా చిన్న నటుడు. ఆ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య గొడవ జరగడంతో డైరెక్టర్ వాళ్ళిద్దరినీ పిలిచి మాట్లాడి, ఆ గొడవను అక్కడితో ఎండ్ చేశారట. ఆ తర్వాత విక్రమ్ తమిళంలో సినిమాలు చేస్తూ స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. మరోవైపు త్రివిక్రమ్ టాలీవుడ్ లోనే ఉంటూ రైటర్ గా సత్తా చాటి, ఆ తర్వాత స్టార్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్ళిపోయాడు.

- Advertisement -

ప్రస్తుతం తమిళంలో చెప్పుకోదగ్గ దిగ్గజ నటుల్లో విక్రమ్ కూడా ఒకరు. ఇక టాలీవుడ్ లో త్రివిక్రమ్ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పుడెప్పుడో జరిగిన ఈ గొడవ ఇంకా కంటిన్యూ అవుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం ఇప్పటిదాకా విక్రమ్ సినిమాలు తెలుగులో ఎన్నో రిలీజ్ అయ్యాయి. కానీ వీళ్ళిద్దరూ ఒక్కసారి కూడా ఎదురు పడలేదు. మరి ఇప్పటికైనా ఆ పాత గొడవను మర్చిపోయి వీళ్ళిద్దరి కాంబోలో ఒక సినిమా కమిట్ అవుతారా? అంటే సందేహమే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు