Tollywood : వెంకీమామ చేజార్చుకున్న మూవీతో మహేష్ బ్లాక్ బస్టర్ హిట్… ఏ మూవీ అంటే?

టాలీవుడ్ లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇద్దరికీ మంచి స్టార్ స్టేటస్ ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడాల్సిన ఈ ఇద్దరు హీరోలు “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” మూవీతో ప్రేక్షకుల దృష్టిలో అన్నదమ్ములుగా మారిపోయారు. ఆ మూవీ వచ్చి చాలా ఏళ్లు గడుస్తున్నప్పటికీ చిన్నోడు పెద్దోడు అంటూ వీళ్ళిద్దరిని ముద్దుగా పిలుచుకుంటారు టాలీవుడ్ ఆడియన్స్. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు సంక్రాంతి బరిలో బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వెంకీ మామ గతంలో చేజార్చుకున్న మూవీ తో మహేష్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు అనే వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ మూవీ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వెంకటేష్ ఫ్యామిలీ హీరోగా ఎప్పటినుంచో రాణిస్తున్నాడు. ఇప్పటికీ వెంకీ మూవీ రిలీజ్ అవుతుంది అంటే ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమా చూడడానికి రెడీ అవుతుంటారు. ఇప్పటిదాకా ఎన్నో అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీల్లో నటించి, తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబుకు కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబోలో గతంలో వచ్చిన “అతడు” మూవీని వెంకీ చేజర్చుకున్నాడట. త్రివిక్రమ్ శ్రీనివాస్ ముందుగా రైటర్ గా పని చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ, మాటలు అందించారు. ఈ సినిమాలతో వెంకటేష్ మంచి కామెడీ టైమింగ్ నటుడు అనే విషయం ప్రూవ్ అయింది. మరోవైపు త్రివిక్రమ్ నువ్వే నువ్వే అనే మూవీతో డైరెక్టర్ గా మారి మంచి సక్సెస్ అందుకున్నాడు.

ఆ తర్వాత త్రివిక్రమ్ “అతడు” మూవీ స్టోరీని వెంకటేష్ ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నాడట. అప్పటికే వెంకటేష్ సినిమాలకు రైటర్ గా పని చేసిన అనుభవం, ఆయనతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా వెంకీ ఈ మూవీకి కరెక్ట్ గా సరిపోతాడని త్రివిక్రమ్ భావించాడట. కానీ వెంకటేష్ ఆ టైంలో ఫుల్ బిజీగా ఉండడంతో ఈ స్టోరీ వెంకటేష్ దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కు, పవన్ కళ్యాణ్ కూడా రిజెక్ట్ చేయడంతో చివరకు మహేష్ బాబు దగ్గరకు వచ్చి ఆగింది. ఇక ఈ మూవీతో మహేష్ మంచి హిట్ అందుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సూపర్ స్టార్ అభిమానులందరికీ ఈ మూవీ ఫేవరెట్. ఇప్పటికీ “అతడు” మూవీ వస్తుంది అంటే టీవీల ముందు కూర్చుండి పోతారు జనాలు. వెంకీ వదిలేసుకున్న మూవీతో మహేష్ హిట్ అందుకోవడం వెనుకున్న కథ ఇది అన్నమాట. కాగా మరోసారి త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న తాజా మూవీ “గుంటూరు కారం” జనవరి 12న రిలీజ్ కానుంది. మరోవైపు వెంకటేష్ ” సైంధవ్”తో జనవరి 13న రాబోతున్నాడు.

- Advertisement -

For More Updates : Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు