Rajinikanth: ఆ స్టార్ హీరోయిన్ ప్రేమలో రజినీకాంత్.. కట్ చేస్తే..!

Rajinikanth:  సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కండక్టర్గా కెరియర్ మొదలుపెట్టి నేడు సూపర్ స్టార్ గా చలామణి అవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా ఎంతోమంది హీరోయిన్లతో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈయన 73 సంవత్సరాల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇటీవలే జైలర్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చి భారీ సక్సెస్ అందుకున్న ఈయన నటుడిగా వరుస సినిమాలతో మరింత బిజీగా ఉన్నారు.

మరొకవైపు తన కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించిన లాల్ చిత్రంలో కూడా ప్రత్యేక పాత్రలో కనిపించారు అంతేకాకుండా వెట్టేన్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు లోకేష్ కనగరాజు దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు రజినీకాంత్. ఇదిలా ఉండగా రజినీకాంత్ కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు విషయంలోకెళితే రజినీకాంత్ మనసులో చిగురించిన ప్రేమకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

తమిళంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన ఘనత రజినీకాంత్ కి మాత్రమే సాధ్యం. అలాంటి రజినీకాంత్ మనసునే దోచుకున్న నటి ఎవరో కాదు దివంగత నటి శ్రీదేవి.. రజనీకాంత్ తో కలిసి 22 కు పైగా చిత్రాలలో నటించింది. దీంతో ఇద్దరి మధ్య పరిచయం బాగా ఏర్పడి.. రజినీకాంత్ శ్రీ దేవీ ప్రేమలో పడ్డారు. అంతేకాకుండా రజినీకాంత్ , శ్రీదేవిని వివాహం కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పగా వారు కూడా అంగీకరించినట్లు సమాచారం. దీంతో శ్రీదేవి తో లవ్ ప్రపోజల్ చేసి.. పెళ్లి చేసుకోవడానికి.. ఈ విషయాన్ని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చెప్పాలని రజనీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళగా..అక్కడ వాళ్ళ ఇంట్లో కరెంటు పోయిందట.. ఆ తర్వాత రజనీకాంత్ తన ప్రేమను చెప్పుకోవడానికి ఇది సరైన సమయం కాదని చెప్పి వెనక్కి వెళ్లారని సమాచారం.

- Advertisement -

తర్వాత రజనీకాంత్ ఎప్పుడూ కూడా శ్రీదేవికి తన ప్రేమ విషయాన్ని వెల్లడించలేదు. అందుకే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారన్న విషయం బహుశా చాలామందికి తెలియదని చెప్పవచ్చు. ఇక రజనీకాంత్ 1981లో లతను వివాహం చేసుకోగా వీరికి ఐశ్వర్య, సౌందర్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ప్రస్తుతం వీరిద్దరూ ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం తెలిసిందే .ఇక శ్రీదేవి కూడా అప్పటికే పెళ్లయిన ప్రముఖ నిర్మాత బోణీ కపూర్ ను వివాహం చేసుకుంది.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు