Rajinikanth: రజినీకాంత్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన సతీమణి..కారణం..?

సౌత్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న రజినీకాంత్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న రజినీకాంత్.. ఏడు పదుల వయసులో కూడా అందరికీ తన సినిమాలతో గట్టి పోటీ ఇస్తున్నారని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా తాజాగా రజినీకాంత్ విషయంలో ఆయన సతీమణి లత అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఒక ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆమె.. రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ , కొచ్చాడయాన్ వివాదంపై స్పందించారు.

లత మాట్లాడుతూ.. రజినీకాంత్ రాజకీయాలలోకి అడుగు పెట్టకపోవడం నన్ను చాలా బాధ పెట్టింది. ఆయనలో నిజమైన నాయకుడిని చూశాను.. బలమైన కారణంతోనే ఆయన రాజకీయాలలోకి అడుగుపెట్టలేదు.. ప్రస్తుతం తమిళనాడు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆయనే కనుక రాజకీయాల్లోకి వచ్చి ఉంటే సూపర్ పవర్ గా ఎదిగే వారు.. అంటూ ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఆమె తెలిపారు అంతేకాదు కొచ్చాడయాన్ చీటింగ్ కేసు గురించి కూడా మాట్లాడుతూ.. సమాజంలో పేరు పొందిన వ్యక్తిని అవమానించడానికి పెట్టిన కేసు ఇది.. సెలబ్రిటీలు గా ఉన్నందుకు మేము మూల్యం చెల్లించుకుంటున్నాము.. ఈ కేసు పెద్దది కాకపోయినా దీని గురించి భారీగానే ప్రచారం జరిగింది..

నిజం చెప్పాలంటే ఇందులో ఎటువంటి మోసం లేదు పలు కథనాలలో ప్రచురితమైనట్లు..ఆ డబ్బుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అది పూర్తిగా మీడియా వన్ , యాడ్ అడ్వర్టైజ్మెంట్ వ్యక్తులకు మధ్య జరిగిన వ్యవహారమే. ఇప్పటికే సమస్య సెటిల్ అయినా కూడా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయంలో నేను కేవలం హామీదారుగా మాత్రమే ఉన్నాను అంటూ ఆమె తెలిపింది.

- Advertisement -

ఇకపోతే రజినీకాంత్ హీరోగా ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 2014లో వచ్చిన త్రీడీ మోషన్ క్యాప్చర్ మూవీ కొచ్చాడయాన్.. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మించగా.. ఈ సినిమా నిర్మాణ పనులకు బెంగళూరుకు చెందిన యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మీడియా వన్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ డైరెక్టర్లలో ఒకరైన మురళీ మనోహర్ అప్పు తీసుకున్నట్లు.. ఇందుకు లతా రజినీకాంత్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే మురళి మనోహర్ తమకు డబ్బులు తిరిగి ఇవ్వలేదని యాడ్ బ్యూరో వారు కొంతకాలం క్రితం కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం పైనే ఇప్పుడు తాజాగా రజనీకాంత్ లత స్పందించడం జరిగింది.

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos, and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు