Manchu Manoj: మౌనిక ప్రెగ్నెన్సీ పై స్పందించిన మనోజ్.. ఏమన్నారంటే..?

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మంచి పాపులారిటీ దక్కించుకున్న మంచు మనోజ్ ఏడాది రెండో పెళ్లి చేసుకొని తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడుపుతున్న విషయం తెలిసిందే. మొదటి భార్య ప్రణతి రెడ్డికి విడాకులు ఇచ్చి.. ఇండస్ట్రీకి కూడా దూరమైన మనోజ్.. ఇటీవల తాను ప్రేమించిన భూమా మౌనికను వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆమెకు కూడా పెళ్లి జరిగి.. ఒక బాబు కూడా పుట్టారు.. ఆమె కూడా తన భర్తతో విభేదాలు ఏర్పడడంతో విడాకులు తీసుకుంది. అలా వీరిద్దరూ ఏడాది పాటు ప్రేమలో ఉంటూ..ఈ ఏడాది మార్చి మూడవ తేదీన వివాహం చేసుకున్నారు.

వీరి వివాహాన్ని మంచు లక్ష్మి తన నివాసంలోనే అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిపించింది. ఇకపోతే వివాహమనంతరం మంచు మనోజ్ సినిమాల్లోకి అడుగుపెట్టి ఇప్పుడు బుల్లితెరపై కూడా ఒక షోకి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. మరొకవైపు మౌనిక రెడ్డి కూడా బిజినెస్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇదిలా ఉండగా మనోజ్ మరోసారి తండ్రి కాబోతున్నారనే విషయం మనకు తెలిసిందే. భూమా మౌనికను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె కొడుకునే తన కొడుకుగా భావించిన ఈయన.. బాబు బాధ్యతలను మొత్తం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మరొకసారి మౌనిక తల్లి కాబోతున్న విషయాన్ని మనోజ్ వెల్లడించారు.

మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు మనోజ్. ఇదిలా ఉండగా తాజాగా మరొకసారి మౌనిక ప్రెగ్నెన్సీ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అసలు విషయంలోకి వెళితే ప్రస్తుతం మౌనిక ఐదవ నెల ప్రెగ్నెన్సీ తో ఉంది అని.. తాము తమ రెండో బిడ్డ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాము అంటూ ఈ సందర్భంగా మనోజ్ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .మరో నాలుగు నెలలు ఆగితే పండంటి బిడ్డకు జన్మనిస్తుంది మౌనిక అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ఏది ఏమైనా మంచు మనోజ్, భూమా మౌనిక లు త్వరలోనే మళ్లీ తల్లిదండ్రులు కాబోతున్నారని తెలిసి ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, అభిమానులు కూడా ఈ జంటకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు