Nagavamsi: నాని ‘గురూజీ’ కాంబోలో మూవీ? కానీ సెట్ చేసేది అతనే?

నేచురల్ స్టార్ నాని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని చాలా రోజుల నుండి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. పైగా ఇద్దరూ కామెడీ కింగులే. గురూజీ మాటల్తో కామెడీ పటాసులేస్తే, తన కామెడీతో ఆడియన్స్ ని పదింతలు నవ్వించే కెపాసిటీ ఉన్నోడు నాని. అలాంటిది వీళ్ళ కాంబో లో మూవీ అంటే తెలుగు ఆడియన్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ కాంబో ఇప్పుడు సెట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.

అదెలాగంటే నాని సితార ఎంటెర్టైన్మెంట్స్ బ్యానర్ లో గతంలోనే ఓ సినిమా చేయాల్సి ఉంది. నిజానికి నాని నటించిన శ్యామ్ సింగరాయ్ మూవీని కూడా సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగ వంశీ నిర్మించాల్సింది, కానీ బడ్జెట్ ఎక్కువ అవుతుందని నాగ వంశీనే వదిలేశాడు. అయితే అప్పటి నాని డేట్స్ ఇంకా సితార నిర్మాత వద్ద ఉన్నాయి. అందుకే నానితో మళ్ళీ సినిమా చేద్దామని చూస్తున్నాడు. అయితే ఇప్పుడు తాజాగా అందిన సమాచారం ప్రకారం నాగవంశీ త్రివిక్రమ్ దర్శకత్వంలో నాని సినిమాని సెట్ చేద్దామని చూస్తున్నాడని తెలిసింది.

ఎందుకంటే త్రివిక్రమ్ ప్రస్తుతం గుంటూరు కారం ప్రమోషన్లలో ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ తో త్రివిక్రమ్ మూవీ చేయాల్సి ఉంది. కానీ అంతకంటే ముందు త్రివిక్రమ్ ఓ చిన్న సినిమా సింపుల్ గా చేద్దామని అనుకుంటున్నాడని టాక్. ఆల్రెడీ త్రివిక్రమ్ దగ్గర మిడ్ రేంజ్ హీరో కి కావాల్సిన స్టోరీ ఉందట. అయితే త్రివిక్రమ్ ఆ కథని తన శిష్యులైన వెంకీ కుడుముల, కృష్ణ చైతన్య లాంటి వాళ్ళకి కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇస్తాడు. లేదంటే తానే డైరెక్ట్ చేస్తాడు.

- Advertisement -

అయితే నాగవంశీ ఈ సీన్లో ఎంట్రీ ఇచ్చి ఇద్దరి కాంబో సెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. పైగా త్రివిక్రమ్ కూడా రిలీఫ్ కోసం నానితో ఓ సినిమా చేయాలని ఆలోచన ఉందని పలు సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక నాగవంశీ దగ్గర కూడా నాని డేట్లు ఉన్నాయి కాబట్టి త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి ట్రై చేస్తున్నాడు. పైగా ఈ సినిమా బడ్జెట్ కూడా దాదాపు రెమ్యునరేషన్స్ తో కలిపి 100 కోట్లు అవనుందట.

అయితే ఇంతకు ముందయితే చిన్న డైరెక్టర్ కాబట్టి బడ్జెట్ విషయంలో నాగవంశీ వెనక ముందు అయ్యే వాడు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ డైరెక్టర్ కాబట్టి, సెట్ అయితే నమ్మకంతో 100 దాటినా పెట్టేస్తాడు. మరి గురూజీ నాని కాంబో సెట్ చేయాలనీ అనుకుంటున్న నిర్మాత నాగవంశీ ఆశలు ఫలిస్తాయో లేదో తెలియాలంటే గుంటూరు కారం రిలీజ్ అయ్యాకే క్లారిటీ వస్తుంది. ఒకవేళ సెట్టైతే ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ నాగవంశీ ఖాతాలో పడినట్టే.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు