Manchu Manoj : తండ్రి కాబోతున్న మంచు మనోజ్.. కావాలనే ఆ పేరు చెప్పలేదా..?

గతేడాది నటుడు మంచు మనోజ్.. భూమా మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి కుమార్తె అయిన మౌనిక తనకు జీవిత భాగస్వామి కావడం తన అదృష్టమని మనోజ్ ఆనందం వ్యక్తం చేశారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం. అయితే ఈ జంట తాజాగా శుభవార్త చెప్పింది. త్వరలోనే తమ ఇంటికి కొత్త అతిధిని ఆహ్వానిస్తున్నామంటూ మనోజ్ స్వయంగా వెల్లడించారు.

త్వరలో తాను తండ్రి కాబోతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం తన భార్య మౌనిక ప్రెగ్నెన్సీతో ఉందనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ.. ” నా ప్రియమైన అత్తమ్మ శ్రీ భూమా శోభ నాగిరెడ్డి గారిని ఆమె పుట్టినరోజు సందర్భంగా స్మరించుకుంటూ సత్కరిస్తున్నాను. అత్తమ్మ.. నీ ప్రేమ పూర్వక ఆలింగణంలో, సంతోషకరమైన వార్తలను పంచుకొని మేము ఓదార్పును పొందుతాము. శ్రీ భూమా నాగిరెడ్డి మామ మీరు మరోసారి తాత అవుతున్నారు. మా చిన్న ధైరవ్ పెద్ద అన్న కావడం పట్ల థ్రిల్లింగ్ గా ఉన్నాము.

మా అమ్మ శ్రీ నిర్మల గారు, మా నాన్నగారు శ్రీ మోహన్ బాబు గారి ఆశీస్సులతో మా కుటుంబంలోని అన్ని మూలాల నుండి మేము ప్రేమా, మద్దతుతో ఆదరిస్తున్నాము. మీ ప్రేమ, ఆప్యాయతలు ఎప్పుడూ మాతోనే ఉండాలి” అని తన ట్విట్టర్ లో రాసుకొచ్చాడు. ఈ క్రమంలో పలువురు అతనికి శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మనోజ్ చేసిన ఈ ట్వీట్ లో ఎక్కడా కూడా తన అన్న విష్ణు గురించి ప్రస్తావించలేదు. మనోజ్ రెండో వివాహం అనంతరం మంచు ఫ్యామిలీలో కొన్ని విభేదాలు చోటు చేసుకున్నాయి. మనోజ్ వివాహానికి అన్నయ్య మంచు విష్ణు దూరంగా ఉన్నారు. ఇప్పుడు మనోజ్ తన ట్వీట్ లో తన అన్నయ్య పేరును ప్రస్తావించకపోవడంతో ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు