Vijay thalapathy: భారీ ధరకు అమ్ముడుపోయిన విజయ్ తలపతి మూవీ శాటిలైట్ హక్కులు..!

Vijay thalapathy: విజయ్ సేతుపతి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లింగ్ మూవీ ” ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం “. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇది విజయ్ కెరీర్ లో 68వ సినిమాగా రూపొందింది.

అయితే ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా ఈ మూవీకి భారీ బిజినెస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది వరకే ఓటీటీలో సెన్సేషనల్ డీల్ పూర్తి కాగా ఇప్పుడు శాటిలైట్ హక్కులు కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.

vijay-thalapathy-movie-satellite-rights-sold-for-huge-price
vijay-thalapathy-movie-satellite-rights-sold-for-huge-price

దీని ప్రకారం ఈ సినిమా తాలూకా హక్కులు జి 5 సమస్త భారీ మొత్తంలో చెల్లించి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి దీని ప్రకారం ఈ చిత్రానికి ఏకంగా 93 కోట్లు చెల్లించినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇది అన్ని భాషలు కలిపి అన్నట్లుగా టాక్ వినిపిస్తుంది. మొత్తానికి అయితే ఈ భారీ చిత్రానికి బిజినెస్ ఊహించని లెవెల్ లో జరుపుకుంది. ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తుండగా ఏజీఎస్ వారు నిర్మాణం వహించారు. ప్రస్తుతం ఈ సినిమాపై భారీ హైప్స్ ఏర్పడ్డాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు