Ram Charan: హైదరాబాద్‌ కు వచ్చేసిన తండ్రి-కొడుకులు

Chiranjeevi-Ram Charan: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్న మెగా కుటుంబానికి ఉన్న ప్రత్యేకత అంతా ఇంత కాదు. ఈ కుటుంబం నుంచి వచ్చిన ప్రతి ఒక్క హీరో సక్సెస్ అయ్యారు. దానంతటకీ కారణం మెగాస్టార్ చిరంజీవి. అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే చాలా ఘనతలను అందుకున్నారు. అయితే తాజాగా పద్మ విభూషణ్ అవార్డును కూడా దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి.

ఈ మేరకు మొన్న ఢిల్లీకి మెగాస్టార్ కుటుంబం మొత్తం వెళ్ళింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. ఈ తరుణంలో ఆయన అభిమానులతో పాటు… తెలుగు ప్రజలు మెగాస్టార్ చిరంజీవికి అభినందనలు తెలిపారు.

ఇది ఇలా ఉండగా… ఈ కార్యక్రమం ముగిసిన నేపథ్యంలో…. ఇవాళ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులు. ఈ తరుణంలోనే హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టులో… మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ మెరిశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. నేను రాజకీయాలకు అతీతంగా ఉన్నాను…రేపు పిఠాపురం వెళ్లడం లేదు, బయట జరిగే ప్రచారమంతా అవాస్తవం అన్నారు. ఎన్టీఆర్ భారతరత్న కు అర్హుడు…కూటమి ప్రభుత్వం వస్తే ఆ దిశగా ఆలోచించాలని కోరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు