Shraddha Das: అతన్నే పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ శ్రద్దా దాస్..!

Shraddha Das: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది ఇక్కడి వారు ఉంటారు… కొంతమంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉంటారు. అయితే ఇందులో అప్పట్లో బాగా సినిమాలు చేసి ఇప్పుడు… ఛాన్సులు రాకుండా ఉన్నవారు కూడా ఉన్నారు. అలాంటి హీరోయిన్ లలో శ్రద్ధ దాస్ ఒకరు.

అలనాటి హీరోయిన్ శ్రద్ధదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లోనే తన హాట్ అందాలతో సినిమాలలో అందరిని మెప్పించేది. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది ఈ బ్యూటీ. ఆ తర్వాత అల్లు అర్జున్ చేసిన ఆర్య 2, మొగుడు, డార్లింగ్ ఇలాంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. అయితే ఈ మధ్యకాలంలో తెలుగులో సినిమాలు చేయడం లేదు ఈ బ్యూటీ. కానీ సోషల్ మీడియాలో మాత్రం అందాలు ఆరబోస్తూ… రచ్చ చేస్తోంది.

అయితే ఏజ్ పైబడినప్పటికీ… ఇంకా పెళ్లి చేసుకోలేదు హీరోయిన్ శ్రద్ధ దాస్. తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది ఈ బ్యూటీ. తన పెళ్లి గురించి చాలామంది వార్తలు రాస్తున్నారని… అలాగే టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని కూడా కొంతమంది ప్రచారం చేశారని ఆమె వెల్లడించింది. అయితే ఇందులో వాస్తవం ఉందని ఆమె తెలిపింది.

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడిని ప్రేమిస్తున్నానని… అతని త్వరలో పెళ్లి చేసుకుంటానని కుండ బద్దలు కొట్టి చెప్పింది. కానీ అతని పేరు ఇప్పుడే చెప్పబోనని త్వరలోనే మీకు తెలుస్తుందని వివరించింది హీరోయిన్ శ్రద్ధాదాస్. అప్పటి వరకు వెయిట్‌ చేయండి అంటూ కామెంట్స్‌ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు