Pushpa 2: పుష్ప 2 సెకండ్ సాంగ్ పై సాలిడ్ అప్డేట్..!

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్నే పూర్తిగా మార్చేసిన సినిమా పుష్ప. ఇక ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు బన్నీ. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ మూవీపై మొదటి బాగం కంటే ఎక్కువ హైప్స్ ఏర్పడ్డాయి.

ఇక ఈ హైప్స్ ని దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ కూడా చాలా జాగ్రత్తగా రూపొందిస్తున్నాడు. ఇక ఈ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈచితం ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్గా విడుదల కానుంది. ఇక ఇదిలా ఉంటే మేకర్స్ పుష్ప 2 నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

Solid update on Pushpa 2 second song
Solid update on Pushpa 2 second song

ఈ సాంగ్ ను తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ తో పాటు బెంగాలీ భాషల్లో విడుదల చేశారు. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ కూడా దక్కింది. ప్రస్తుతం రికార్డ్ వ్యూస్తో దూసుకుపోతుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ నుంచి రెండో పాటగా ఓ రొమాంటిక్ సాంగ్ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, రష్మిక పై వచ్చే ఈ రొమాంటిక్ సాంగ్ ను ఎంతో గ్రాండ్ గా ప్లాన్ చేశారట మేకర్స్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు