Kovai Sarala: పెళ్లి చేసుకుంటే వారికి దిక్కెవరు..అందుకే..?

Kovai Sarala.. టాలీవుడ్ సినీ పరిశ్రమలో మేల్ కమెడియన్స్ లో ప్రథమంగా వినిపించే పేరు బ్రహ్మానందం అయితే ఫిమేల్ కమెడియన్స్ లో ప్రప్రథమంగా వినిపించే పేరు కోవై సరళ.. సంపూర్ణమైన హాస్యానికి పరిపూర్ణమైన అర్థం కోవై సరళ.. మాటల్లో వెటకారం.. చేతల్లో చమత్కారం.. సహజ నటిగా… సహాయనటిగా.. ఎన్నో పాత్రలకు ప్రాణం పోసి.. సరికొత్త కామెడీకి జీవం పోసి.. కామెడీ క్వీన్ అనిపించుకున్నారు. తాజాగా ఆలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు.. ఈ నేపథ్యంలోనే తన కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను ఆలీతో పంచుకున్నారు కోవై సరళ.. అందులో భాగంగానే ఇంత వయసు వచ్చినా తాను వివాహం చేసుకోకపోవడానికి గల కారణాన్ని కూడా ఆమె వెల్లడించారు..

Kovai Sarala: If I get married, they will have no choice..that's why..?
Kovai Sarala: If I get married, they will have no choice..that’s why..?

కోవై సరళ కుటుంబ నేపథ్యం..

షో లో భాగంగా మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? అని కోవై సరళను అలీ ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. నేను కోయంబత్తూర్ లో పుట్టి పెరిగాను.. మా అమ్మ నాన్న ఇద్దరూ కేరళకు చెందినవారు.. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలనే కోరిక ఉండేది.. మా నాన్న మిలిటరీ ఉద్యోగి కావడంతో ఇంట్లో చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. పొద్దున్నే ఐదు గంటలకు లేవాలి. అలా కఠినంగా ఉండేవారు.. దాంతో డాక్టర్ కావడం కంటే యాక్టర్ అవడం మేలు అనుకున్నాను..ఒకరోజు నాన్న దగ్గరకు వెళ్లి నేను సినిమాల్లోకి వెళ్తానని చెప్పాను.. నాన్న నా ఇష్టాన్ని చూసి ఓకే అన్నారు.. ఇక చిన్నప్పటి నుంచి నేను ఎంజీఆర్ అభిమానిని.. ఆయన్ని చూస్తూనే సినిమాల్లోకి రావాలని అనుకున్నాను.. అలా ఆరవ తరగతి చదివేటప్పుడు ఆయనను చూడాలని.. ఆయన బసచేసిన హోటల్ ముందు నిలుచునేదాన్ని.. ఒక వారం రోజుల తర్వాత ఆయనే నన్ను పిలిచి నా వివరాలు అడిగారు.. నాకు సినిమాల్లోకి రావాలని ఉంది అని చెప్పాను.. అయితే ఆయన ముందు చదువుకో.. తర్వాత హీరోయిన్ గా నటించవచ్చు అన్నారు.. ఇక నేను చదువుకోడానికి కూడా ఆయనే డబ్బు సహాయం చేశారు అంటూ తెలిపింది..

హీరోయిన్ గా అవకాశం..

తెలుగులో కమెడియన్ గా బిజీగా ఉన్నప్పుడు కమలహాసన్ అసిస్టెంట్ నాకు ఫోన్ చేసి నా డేట్స్ కోసం కమల్ హాసన్ ఎదురుచూస్తున్నట్లు చెప్పాటు. నేను బిజీగా ఉన్నానని చెప్పడంతో.. ఐదు నెలలు నా కోసం వెయిట్ చేశారు. ఇక సినిమా అయిపోయాక చివరి రోజు.. ఇంత బాగా మరెవరూ చేయలేరు.. అని చిత్ర బృందామంతా నన్ను ప్రశంసించింది అంటూ గర్వంగా చెప్పుకొచ్చారు.. అలా కమలహాసన్ హీరోగా నటించిన సతీ లీలావతి సినిమాలో కోవై సరళ హీరోయిన్ గా.. నటించినది.. ఈమె తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో మొత్తం 900 పైగా చిత్రాలలో నటించింది..

- Advertisement -

పెళ్లి చేసుకోకపోవడానికి కారణం..

కచ్చితంగా పెళ్లి చేసుకోవాలనే కండిషన్ లేదు కదా.. స్వేచ్ఛ కోసమే నేను చేసుకోలేదు.. బోర్ కొడితే హిమాచల్ ప్రదేశ్ వెళ్తాను.. తరచూ షిరిడీ వెళ్తుంటాను.. మనం భూమి మీదకు ఒంటరిగా వచ్చాము.. బంధాలన్నీ వచ్చాయి. ఎంతో మంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా చివరి రోజుల్లో ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు.. ఇక మనల్ని ఒకరు చూడాలని ఎప్పుడూ అనుకోకూడదు. ధైర్యంగా ముందుకు వెళ్లాలి.. ఏ దిక్కు కోసం నేను ఎదురు చూడను.. అందుకే పెళ్లి చేసుకోలేదు.. అంటూ క్లారిటీ ఇచ్చింది కోవై సరళ..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు