venu swamy: వేణు స్వామితో మరో హీరోయిన్ రహస్య పూజలు..!

Venu Swami : వేణు స్వామి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సెలబ్రిటీల జాతకాలు చెబుతూ ఎప్పుడూ వార్తలో నిలుస్తూ ఉంటారు వేణు స్వామి. ఇటీవల ఈయన పేరు రెండు తెలుగు రాష్ట్రాలలోనూ మార్మోగిపోతుంది. ఆయన చెప్పినవి జరుగుతున్న నేపథ్యంలో జనాలు కూడా అదే నిజమని నమ్ముతున్నారు. గతంలో నాగచైతన్య – సమంత విడిపోతారని చెప్పి వార్తల్లో నిలిచారు వేణు స్వామి. ఆ మధ్య ఓ హీరో చనిపోతాడని చెప్పారు. అలాగే హీరో తారకరత్న చనిపోయాడు.

ఇక సినిమాల విషయంలో కూడా ఆయన చెప్పినట్లు జరుగుతుండడంతో ప్రతి ఒక్కరు ఆయన సలహాలు, సూచనలు పాటిస్తున్నారు. అలాగే చాలామంది హీరోయిన్లు ఆయనతో పూజలు చేయించుకుంటే కెరీర్ దూసుకుపోతుందని నమ్ముతున్నారు. యంగ్ హీరోయిన్ డింపుల్ హయాతి కూడా వేణు స్వామితో హైదరాబాద్ లోని తన అపార్ట్మెంట్ లో రహస్యంగా పూజలు చేయించింది. అలాగే నిధి అగర్వాల్ కూడా ఈ లిస్టులో చేరింది.

అయితే ఇప్పుడు రష్మిక కూడా రహస్యంగా వేణు స్వామితో పూజలు చేయించుకుందట. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్మిక వేణు స్వామితో రాజ శ్యామల యాగం చేయించుకుందట. వేణు స్వామితో పూజలు చేయించుకుంటే తన కెరీర్ సాఫీగా సాగిపోతుందని నమ్మిన రష్మిక.. వేణు స్వామి తో పూజలు చేయించుకుని తన శిష్యురాలిగా మారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు