Ntr: ఎన్టీఆర్ తో గొడవలపై క్లారిటీ ఇచ్చేసిన వక్కంతం వంశీ..!!

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఇష్టపడుతూ ఉంటారు.. అలాంటి వారిలో డైరెక్టర్ వక్కంతం వంశీ కూడ ఒకరు..వీరి కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు సైతం విడుదలయ్యాయి. వాస్తవానికి ఎన్టీఆర్ జై లవకుశ సినిమాకి బదులుగా డైరెక్టర్ వక్కంతం వంశీ సినిమాలో నటించాల్సి ఉండేదట. అయితే ఎందుకో కొన్ని కారణాల చేత ఈ ప్రాజెక్టు నిలిచిపోవడం జరిగిందట. కానీ ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. ఇటీవలే డైరెక్టర్ వక్కంతం వంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.

కథలకి సంబంధించిన సమస్యల వల్ల జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా ఆగిపోయింది అంటూ డైరెక్టర్ తెలియజేయడం జరిగింది. అయితే కథ పూర్తిగా తయారుచేసి.. సినిమా చేద్దామనుకునే కాన్ఫిడెంట్ ఇద్దరికి రాలేదని దీంతో ఈ సినిమా ఆగిపోవలసి వచ్చింది అంటూ డైరెక్టర్ వక్కంతం వంశీ తెలియజేశారు. అలా ఒక్కొక్క కథకు ఒక్కో సమస్య రావడంతో మరెప్పుడైనా సినిమా చేద్దామని బయటకి వచ్చేసానని తెలియజేశారు డైరెక్టర్ ఒక్కంతం వంశీ.

తాను చిరంజీవికి వీర అభిమానిని అని.. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ నీ అని డైరెక్టర్ వక్కంతం వంశీ తెలియజేశారు.. ఎన్టీఆర్ తో తాను సినిమా చేయకపోవడంతో పలు రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.. చిరంజీవితో సినిమా చేయాలని పలు రకాలు ప్రయత్నాలు చేస్తున్నానంటూ కూడా తెలియజేశారు.. ముఖ్యంగా అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సమయంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా కథ చాలామందికి నచ్చింది అని తెలియజేశారు.

- Advertisement -

కానీ తన దర్శకత్వంలోంచి రేసుగుర్రం లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమాను ఆశించారని.. దీంతో అల్లు అర్జున్ తో సినిమా కథలో లోపాలు ఉండడం వల్ల ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని తెలిపారు. ఈ సినిమా కథను కూడా మొదట ఎన్టీఆర్ కి చెప్పగా ఎందుకో తను చేయలేనని చెప్పి వదిలేసారని తెలిపారు. అల్లు అర్జున్ మాత్రం ఈ సినిమాని సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలియజేయడం జరిగింది వక్కంతం వంశీ.

ఇక జూనియర్ ఎన్టీఆర్ తో తనకు ఎలాంటి గొడవలు లేవని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైనా కథ నచ్చితే కచ్చితంగా ఎన్టీఆర్ తో సినిమా చేస్తానని తెలిపారు. తాను జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు ఎన్నో కథలను కూడా అందించానని తెలియజేశారు వక్కంతం వంశీ. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు