Teja Sajja: ‘హనుమాన్’ కోసం ‘రవన్న’ మాట సాయం..!

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రాబోతున్న సినిమాల కోసం, వాటి యొక్క మూవీ మేకర్స్ వరుస ప్రమోషన్లు చేస్తూ జోరు మీదున్నారు. ఇంకా కొన్ని సినిమాలు పొంగల్ రేసులో ఫిక్స్ కాకున్నా ఎవరికీ వారు తగ్గేదేలే అంటూ ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్తున్నారు. ఇక హనుమాన్ సినిమా జనవరి 12న రిలీజ్ కి రెడీ అవుతుండగా, అదే రోజున మహేష్ బాబు నటించిన గుంటూరు కారం రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాల రిలీజ్ డేట్లపై ప్రొడ్యూసర్ల మధ్య గత కొన్ని రోజులుగా క్లాష్ నడుస్తుంది.

ఇక ఆ తర్వాత రోజు కూడా ఈగల్, నా సామి రంగ సినిమాలు కూడా రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్నాయి. అయితే ఈ సినిమాల విషయం పక్కన పెడితే హనుమాన్ సినిమా రిలీజ్ డేట్ దగ్గరవుతున్న కొద్దీ సినిమాపై ఆసక్తి పెంచే ప్రయత్నంలో మేకర్స్ ఉన్నారు. ఇలాంటి టైం లో హనుమాన్ నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. హనుమాన్ సినిమా కోసం మాస్ మహారాజ్ రవితేజ మాట సాయం అందించనున్నాడు.

అయితే మీరనుకున్నటు ఇది రిలీజ్ డేట్ విషయంలో మాట సాయం కాదు.. రవితేజ హనుమాన్ సినిమా కోసం తన గొంతు వినిపించబోతున్నాడట. ఈ సినిమాలో కోటి అనే ఓ కోతి ని కీలక పాత్రలో చిత్ర యూనిట్ నటింపచేయగా, ఆ పాత్ర కోసం రవితేజ తో డబ్బింగ్ చేయించనున్నట్టు మేకర్స్ తెలియచేసారు.

- Advertisement -

ఇక రవితేజ ఇలా డబ్బింగ్ చెప్పడం కొత్తేమి కాదు.. గతంలో మర్యాద రామన్న, అ , రీసెంట్ గా మహా వీరుడు సినిమాలకు వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇప్పుడు హనుమాన్ కోసం తన గాత్ర దానం చేయబోతున్నాడు. ఇక ఇదే సంక్రాంతికి హనుమాన్ తో పాటు రవితేజ ఈగల్ కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు