Hanuman: ‘ప్రశాంత్ వర్మ’ అస్సలు తగ్గట్లేదుగా!

టాలీవుడ్ లో రాబోయే సంక్రాంతికి చాలా సినిమాలు ఖర్చీఫ్ వేశాయని తెలిసిందే. చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా అన్ని రకాల సినిమాలు డేట్లు లాక్ చేసుకున్నాయి. 2024 సంక్రాంతికి దాదాపు 7 సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతుండగా, అందరికంటే ముందు మహేష్ బాబు గుంటూరు కారం రిలీజ్ డేట్ లాక్ చేసుకోగా, కొన్ని వాయిదాల అనంతరం ప్రభాస్ కల్కి 2898AD, అలాగే వెంకటేష్ సైంధ‌వ్ సంక్రాంతి రిలీజ్ కి సిద్ధమవుతున్నాయి.

ఇక వీటితో పాటు నాగార్జున “నా సామి రంగ”, రవితేజ ఈగిల్, శివ కార్తికేయన్ అయలన్, సినిమాలు స్టార్ట్ చేసినప్పుడే సంక్రాంతికి తీసుకొస్తున్నామని అనౌన్స్ చేసారు. ఇక వీటితో పాటు చిన్న సినిమా గా స్టార్ట్ అయ్యి పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతున్న సినిమా “హనుమాన్“. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఈ ఇయర్ సమ్మర్ లోనే రిలీజ్ కావాల్సింది. ఆదిపురుష్ సినిమా రిసల్ట్ వల్ల మేకింగ్ లో ఛేంజెస్ చేయాలని, ఏకంగా సంక్రాంతికి షిఫ్ట్ చేసారు.

ఈ విషయం అనౌన్స్ చేసి మూడు నెలలు కావస్తున్నా, ఆ తరువాత నుండి మాత్రం మేకర్స్ నుండి మళ్ళీ ఎలాంటి అప్డేట్ రాలేదు. అందుకే చాలా మంది హనుమాన్ మళ్ళీ వాయిదా పడిందని అనుకున్నారు. కానీ తాజాగా దసరా శుభాకాంక్షలు చెప్తూ హనుమాన్ సినిమా పోస్ట్ పోన్ కాలేదని, సంక్రాంతికి ఖచ్చితంగా వస్తుందని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పోస్టర్ ద్వారా చెప్పడం జరిగింది. అంతే కాదు త్వరలోనే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ప్రశాంత్ వర్మ తన సినిమాని సంక్రాంతికే తీసుకొద్దామని పక్కాగా ఫిక్స్ అయ్యాడని అనిపిస్తుంది.

- Advertisement -

అయితే సంక్రాంతి వచ్చే సరికి ఇప్పుడు ఫిక్స్ అయిన వాటిలో కనీసం రెండు మూడు సినిమాలైనా వాయిదా పడడం పక్కా. ఎందుకంటే ఇన్ని సినిమాలకి థియేటర్లు మ్యానేజ్ చేయడం కష్టం.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు