Chiranjeevi: రికార్డింగ్ తో పని స్టార్ట్ చేసిన ‘మెగా156’

మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ బిజీ అవుతున్నారు. భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత రీమేక్ సినిమాని పక్కన పెట్టేసిన చిరు, మోకాలి గాయం వల్ల అనౌన్స్ చేసిన ఏ సినిమాని మొదలు పెట్టలేదు. ఇప్పుడు దసరా సందర్బంగా అఫీషియల్ గా తన 156 సినిమాని మొదలు పెట్టేసారు. యువీ క్రియేషన్స్ బ్యానర్ లో బింబిసార ఫేమ్ వశిష్ఠ మల్లిడి మెగా156 సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇక చిరంజీవి బర్త్ డే రోజు ఈ సినిమా అనౌన్స్ మెంట్ కాగా సెట్స్ పైకి రావడానికి రెండు నెలల టైం పట్టింది. దసరా సందర్బంగా పూజ కార్యక్రమాలతో సినిమా లాంచ్ అవగా, ఈ ఈవెంట్ కి చిరు తో పాటు మూవీ మేకర్స్ కూడా రావడం జరిగింది.

అయితే తాజాగా చిత్ర యూనిట్ మూవీ లాంచ్ ఈవెంట్ వీడియో ని రిలీజ్ చేయగా, దాంట్లో భాగంగా సినిమాకి మ్యూజిక్ అందిస్తున్న ఎం.ఎం. కీరవాణి మాట్లాడుతూ, ఒకప్పుడు ఏ సినిమాకైనా సాంగ్ రికార్డింగ్ తో షూటింగ్ మొదలు పెట్టడం ఆనవాయితీ, అయితే రాను రాను ఈ ఆనవాయితీ అందరూ మర్చిపోయారు. ఇప్పుడు మెగా156 సినిమాతో మళ్ళీ ఆ పద్ధతిని స్టార్ట్ చేస్తున్నాము, ఈ సినిమాని ఒక సెలబ్రేషన్ సాంగ్ తో మొదలు పెడుతున్నామని చెప్పడం జరిగింది. అంతే కాదు సినిమాలో ప్రస్తుతానికి 6 పాటలు ఉంటాయని చెప్పారు. అన్ని పాటలు చంద్రబోస్ రాయనున్నారు.

- Advertisement -

ఇక సినిమా రెగ్యులర్ షూట్ మాత్రం దీపావళి తర్వాతే స్టార్ట్ కానుందని సమాచారం. సోషియో ఫాంటసీ కథతో పంచ భూతాల నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని టాక్ నడుస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు