Mega157:మూడు లోకాలు.. ముగ్గురు దేవకన్యలు…

Mega157:

మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత తన తప్పు తెలుసుకున్నాడు. రీమేక్ సినిమాలు ఆపేసి స్ట్రెయిట్ సినిమాలకే ఓకే చెప్పే పనిలో ఉన్నారు. అలాంటి క్రమంలో బింబిసార డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి చెప్పిన స్క్రిప్ట్ కి ఓకే చెప్పిన మెగాస్టార్ త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించనున్నారు. యూవీ క్రియేషన్స్ నిర్మించబోయే ఈ సినిమా అఫిషియల్ అనౌన్స్ మెంట్ చిరంజీవి బర్త్ డే రోజు జరిగింది.

ఇంకా షూటింగ్ స్టార్ట్ కాకపోయినప్పటికీ ఈ సినిమాపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.ఈ మధ్యనే ఢిల్లీలో తన మోకాలి సర్జరీ చేయించుకున్న చిరు ప్రస్తుతం కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు. త్వరలోనే సినిమాని ఆరంభించనున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నట్టు సమాచారం అందింది. అంతే కాదు ఈ సినిమాలో మూడు లోకాల నేపథ్యంలో కథ సాగుతుంది కాబట్టి, ఒక్కో లోకానికి ఒక్కో హీరోయిన్ ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

అందులో ఒక హీరోయిన్ అనుష్క అని ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ నడుస్తుంది. ఇక ఈ సినిమా పంచ భూతాల కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని అనౌన్స్ మెంట్ పోస్టర్ లో చెప్పడం జరిగింది. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు లెజెండరీ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించనున్నారు. సెప్టెంబర్ చివర్లో గాని, అక్టోబర్ మొదటి వారం లోగాని ఈ సినిమా ఓపెనింగ్ జరుపుకోవచ్చు. ఇక ఈ సినిమా కంటే ముందే కళ్యాణ్ కృష్ణ సినిమా అనుకున్నా, ఆ సినిమా స్క్రిప్ట్ పనుల్లోనే ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు