Megastar 157 announcement : ఆసక్తి రేపుతున్న మెగా స్టార్ కొత్త సినిమా పోస్టర్ !

megastar 157 announcement

మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ సినిమాలపై గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్న విషయం తెలిసిందే. బింబిసార ఫేం వశిష్ఠ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి ఒక భారీ స్థాయి ఫాంటసీ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తు ట్రెండ్ అవుతున్న క్రమంలో.. ఆ రూమర్స్ అన్నింటిని నిజం చేస్తూ ఈరోజు మెగా స్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా కాసేపటి క్రితమే వసిష్ఠ మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో రాబోయే సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమా పోస్టర్ కాసేపటి క్రితం రిలీజై, అందరిని ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం మెగా స్టార్ చిరంజీవి కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. ఇక పోస్టర్ ను బట్టి చూస్తే ఈ సినిమా పంచభూతాల ఆధారంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఏం ఏం కీరవాణి మ్యూజిక్ అందించబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

కాగా బింబిసార సినిమా తరువాత డైరెక్టర్ వసిష్ఠ ఆ సినిమాకు పార్ట్ 2 చేయవలసి ఉండగా కొన్ని కారణాల ఆయన ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకొని చిరంజీవితో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాతో పాటు చిరంజీవి తన కూతురు సుష్మిత కొణిదెల ప్రొడ్యూసింగ్ చేస్తున్న మరో సినిమాలో కూడా నటిస్తున్నారు అయితే ఆ సినిమా పోస్టర్ కూడా రిలీజ్ చేసిన మేకర్స్ దర్శకుడు ఎవరన్నా విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు