Akira Nandan’s Tollywood entry : సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న అకీరా నందన్ ?

Akira Nandan’s Tollywood entry

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ త్వరలోనే హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ చేస్తున్న అకిరా నందన్ కు సినిమాలలో కూడా ఆసక్తి బాగానే ఉంది అన్నట్టు తెలుస్తోంది.

ఇటీవలనే అకిరా ఒక షార్ట్ ఫిలిం చేయడం, అలాగే పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా చూడటానికి సుదర్శన్ థియేటర్ కు వెళ్లడం ఇవన్నీ అకీరా కు సినిమాల మీద ఉన్న ఆసక్తిని చెప్పకనే చెబుతుంది. కానీ రేణు దేశాయ్ మాత్రం అకీరా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నుంచి అకీరా నందన్ ఎంట్రీ పై ఎంత ప్రెషర్ వస్తున్న కూడా ఆమె అకీరా సినిమాలలోకి రావడంపై ఆమె నెగిటివ్ గానే స్పదింస్తు వస్తుంది. దానికి కారణం అకీరా చదువు ఇంకా పూర్తి కాకపోవడమే. ఇక లేటెస్ట్ గా ఆమె మరోసారి అకీరా ఎంట్రీ పై అభిమానులకు క్లారిటీ ఇచ్చింది.

అయితే అకిరా నందన్ సినిమాలలో ఎంట్రీ విషయం ఇప్పుడు తెరపైకి రావడానికి కారణం నిన్న సాయంత్రం డైరెక్టర్ కే రాఘవేంద్ర రావు తన సోషల్ మీడియాలో అకీరా నందన్ తో దిగిన ఫోటోలు షేర్ చేయడమే. అయితే రాఘవేంద్ర రావు నిన్న సాయంత్రం అకీరా నందన్ మరియు బాహుబలి నిర్మాత శోబు యార్లగడ్డ కొడుకు కార్తికేయ తో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసాడు అలాగే అకీరా,కార్తికేయ ఇద్దరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని ఫిల్మ్ స్కూల్ లో జాయిన్ అవుతున్నారని ఆ పోస్ట్ లో తెలియపరచాడు.

- Advertisement -

దాంతో సోషల్ మీడియా అంత అకీరా తొందర్లోనే సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ పోస్ట్ లు వేసి హల్చల్ చేసారు, ఆ తరువాత కాసేపటికే రాఘవేంద్ర రావు ఆ పోస్ట్ ను డిలీట్ చేసారు. కానీ అప్పటికే ఆ పోస్ట్ ను అంత సేవ్ చేసుకోవడంతో అకిరా టాలీవుడ్ ఎంట్రీ న్యూస్ బాగా పాపులరైంది. ఇక ఈ విషయం రేణు దేశాయ్ స్పదింస్తు అకీరా ఇప్పట్లో సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వడు.. తనకేమాత్రం సినిమాలపై ఆసక్తి లేదు. ఒకవేళ తాను సినిమాలలోకి ఎంట్రీ ఇస్తానని చెబితే వెంటనే నేనే మీకు ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తాను. అప్పటి వరకు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడకండి అంటూ ఆమె రాసుకొచ్చింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు