Pawan kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ పై అఫీషీయల్ అప్డేట్

Pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అప్డేట్ ను కాసేపటి క్రితం మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఇప్పటి వరకు రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. కాగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ మీటింగ్స్ వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక తొందరలోనే ఈ ఉస్తాద్ భగత్ సింగ్ తిరిగి మళ్ళీ సెట్స్ పైకి వెళ్లనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళ్ లో సూపర్ హిట్టైనా తేరి సినిమాకు రీమేక్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తెరకెక్కుతుంది. రీమేక్ సినిమాను తనదైన స్టైల్ తీసి, సూపర్ హిట్ సక్సెస్ లు అందుకున్న హరీష్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కొద్దీ ర్రోజుల క్రితం ఈ సినిమాకి సంబందించిన గ్లిమ్స్ వీడియో రిలీజ్ అవ్వగా , ఆ వీడియో ప్రేక్షకులను మరియు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను విపరితంగా ఆకట్టుకోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ సినిమా అయినప్పటికీ అందరిలో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 5 నుంచి మొదలవనున్నట్టు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించింది. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుండటంతో ఈ సినిమాపై మంచి బజ్ ఉంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాదికి రిలీజ్ చేయనున్నట్టు సమాచారం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు