Gandeevadhari arjuna trailer talk : అదే మిస్టేక్ రిపీట్ చేస్తున్న వరుణ్ తేజ్

Gandeevadhari arjuna trailer talk

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తోన్న గాండీవధారి అర్జున సినిమా ట్రైలర్ కాసేపటి క్రితం విడుదలైంది. యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కింది. వరుణ్ తేజ్ సరసన ఏజెంట్ బ్యూటీ సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. నాజర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాని ఎస్విసిసి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.

దాదాపు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించబడిన ఈ సినిమాకి సంబందించిన గతంలో రిలీజ్ చేసిన ప్రి టీజర్, మరియు టీజర్ ఆకట్టుకోగా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కొంతవరకు పాజిటివిటి ఏర్పడింది. ఇక తరువాత రిలీజైన పాటలు కొంతవరకు పరవాలేదనిపించాయి. ఆగస్ట్ 25 న ఈ సినిమా రిలీజ్ అవబోతుండగా సినిమాపై అంచనాలను మరింతగా పెంచాలనే ఉద్దేశ్యంతో కాసేపటి క్రితం ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ ను విడుదల  చేసారు మేకర్స్.

ఇక ఈ ట్రైలర్ గురించి ఒక్క ముక్క చెప్పాలంటే పాత చింతకాయ పచ్చడి లానే ఉందని చెప్పాలి. ఇటీవల కాలంలో వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమాలలో ఉండే అంశాలే  ఈ సినిమాలో కూడా ఉన్నాయ్ తప్ప, వేరే ఏ ఇతర కొత్త ఎలిమెంట్స్ లేవని ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది.

- Advertisement -

అయితే గతంలో స్పై థ్రిల్లర్ సినిమాలకు బాగా క్రేజ్ ఉన్నమాటా వాస్తమే కానీ ఈ సినిమాల్లో ఒకటే రకమైన ఫార్మట్ ఉండటం, వేరే ఏ కొత్త అంశాలు చూపించడానికి పెద్దగా స్కోప్ లేకపోవడంతో ఈ స్పై థ్రిల్లర్ సినిమా కాన్సెప్ట్ లు జనాలకు బోర్ కొట్టేశాయి. అందుకే ఈ కాసెప్ట్ తో వస్తోన్న సినిమాలకు ప్రేక్షకులు అస్సలు ఆసక్తి చూపించడం లేదు.ఈ విషయాన్ని రుజువు చేస్తూ నిఖిల్ స్పై , అఖిల్ ఏజెంట్ సినిమాలు డిజాస్టర్ గా నిలిచాయి. మరీ ఇటువంటి సమయంలో వరుణ్ తేజ్ ఈ సినిమాను ఎందుకు ఒప్పుకున్నాడనేది ప్రశ్నార్ధకం. గతంలో కూడా వరుణ్ తేజ్ ఇదే విధంగా మొహమాటానికి పోయి గని అనే ఒక అవుట్ డెటెట్ సినిమా చేసి బొక్క బోర్లా పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ అదే మిస్టేక్ ను గాండీవధారి అర్జున సినిమా విషయంలో ఆయన రిపీట్ చేయినట్టే ఉంది.  ఆగస్ట్ 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మరీ అందరి అంచనాలను మార్చేసి హిట్ గా నిలుస్తుందో లేక స్పై త్రిల్లర్ జానర్ లో లేటెస్ట్ ఫ్లాప్ గా నిలుస్తుందో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు